Redmi K100 leaks: రెడ్‌మి సంస్థ తన రాబోయే సరికొత్త సిరీస్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌ను భారీ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో టెస్ట్ చేస్తోంది.
Redmi K100
Redmi K100 Leaks: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కోరుకునే మధ్యతరగతి మరియు యువతను టార్గెట్ చేస్తూ రెడ్‌మి K100 సిరీస్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వైబో ద్వారా లీకయ్యాయి. ఈ సరికొత్త సిరీస్‌లోని హై-ఎండ్ మోడల్‌లో మొబైల్ రంగంలోనే అత్యంత భారీదైన 9,000 mAh కెపాసిటీ గల మెగా బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్‌ను పదే పదే ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా రోజుల తరబడి వాడుకోవచ్చు.
ప్రముఖ +టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన లీకుల ప్రకారం.. రెడ్‌మి సంస్థ తన రాబోయే సరికొత్త సిరీస్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌ను భారీ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో టెస్ట్ చేస్తోంది. ఇది బహుశా రెడ్‌మి K100 ప్రో లేదా రెడ్‌మి K100 ప్రో మాక్స్ మోడల్ కావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే సామాన్యులకు సైతం ప్రొఫెషనల్ క్వాలిటీని అందించేందుకు దీని వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సుదూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి వీలుగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా జత చేశారు. గత మోడల్ అయిన K90 ప్రో మాక్స్ లో కేవలం 50 ఎంపీ కెమెరా మాత్రమే ఉండగా, ఈసారి కెమెరా విభాగంలో చాలా పెద్ద మార్పులు చేశారు.
Budget 5G Smartphones : రూ.30 వేల బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఏది? నథింగ్, టెక్నో, రియల్‌మి మొబైల్స్ మధ్య బిగ్ ఫైట్
పర్‌ఫార్మెన్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో హెవీ గేమ్స్ ఆడుకోవాలనుకునే వారి కోసం ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండేందుకు ఇందులో విడిగా ఒక డిస్‌ప్లే చిప్ ను కూడా ఇస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, గుండ్రటి అంచులతో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 185Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. దీనివల్ల విజువల్స్, వీడియోల క్లారిటీ చాలా షార్ప్‌గా, స్మూత్‌గా కనిపిస్తాయి.
ఈ భారీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌లో 9,000 mAh బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడం కోసం 100 వాట్ల పవర్‌ఫుల్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ జోడించింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఈ మెగా బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే, ఫోన్‌ను సులభంగా లాక్ మరియు అన్‌లాక్ చేసుకోవడానికి స్క్రీన్ పైనే ఉండే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ప్రీమియం రేంజ్ ఫోన్లలో ఉండే ఈ ఫీచర్లను రెడ్‌మి తన బడ్జెట్ కిల్లర్ సిరీస్‌లో ప్రవేశపెట్టడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains