Google Pixel Watch Leaks: ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్, టైడ్ చార్ట్ భాగస్వామ్యంతో ఈ వాచ్ ఫస్ట్ లుక్ ఫోటోలను విడుదల చేశారు.
Pixel Watch 5
Google Pixel Watch 5 Leaks: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తన వేరబుల్స్ విభాగంలో మరో సరికొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. కంపెనీ తన అప్ కమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్ గూగుల్ పిక్సెల్ వాచ్ 5ను త్వరలోనే అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది. అయితే ఈ వాచ్ అధికారికంగా లాంచ్ కాకముందే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, డిజైన్ రెండర్స్ ఆన్‌లైన్ లో లీకై సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్, టైడ్ చార్ట్ భాగస్వామ్యంతో ఈ వాచ్ ఫస్ట్ లుక్ ఫోటోలను విడుదల చేశారు. ఇందులో పిక్సెల్ వాచ్ 5 చాలా ఆకర్షణీయమైన రంగులలో మెరిసిపోతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
లీకైన డిజైన్ రెండర్స్, ఫోటోలను బట్టి చూస్తే, ఈసారి గూగుల్ పిక్సెల్ వాచ్ 5 డిజైన్ పరంగా పెద్దగా కొత్త ప్రయోగాలు ఏమీ చేయలేదని తెలుస్తోంది. ఇది దాదాపు తన మునుపటి మోడల్ అయిన పిక్సెల్ వాచ్ 4 లాంటి లుక్ తోనే కనిపిస్తోంది. దీని డయల్ పై క్లాసీగా ఉండే కర్వ్డ్ గ్లాస్‌ను అమర్చారు. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా చార్జింగ్ పిన్లను సైడ్ భాగంలో అమర్చడం విశేషం. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ 41mm, 45mm డయల్ సైజులలో మార్కెట్లోకి తీసుకురానుందని సమాచారం.
నెట్‌వర్క్ సపోర్ట్ పరంగా గూగుల్ ఈ వాచ్‌ను రెండు వేరియంట్లలో తీసుకురాబోతోంది. ఇందులో ఒకటి కేవలం వై-ఫై వేరియంట్ కాగా, మరొకటి ఎల్‌టీఈ కనెక్టివిటీ వేరియంట్. అలాగే సైజ్ ను బట్టి కలర్ ఆప్షన్లలో స్వల్ప మార్పులు చేశారు. చిన్న సైజ్ అయిన 41mm డయల్ వేరియంట్ డార్క్ ఆంత్రాసైట్, నేచురల్ సిల్వర్, పైరైట్, వార్మ్ గోల్డ్ వంటి నాలుగు కలర్స్ లో రానుంది. ఇక పెద్ద సైజ్ అయిన 45mm వేరియంట్ డార్క్ ఆంత్రాసైట్, నేచురల్ సిల్వర్, పైరైట్ వంటి మూడు ప్రత్యేకమైన రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది.
Nothing Phone (4b) : భారత్‌లో నథింగ్ ఫోన్ (4b) సేల్స్ షురూ.. మార్కెట్లోకి సరికొత్త గ్లిఫ్ లైటింగ్ స్మార్ట్‌ఫోన్
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ గూగుల్ లేటెస్ట్ వేర్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కానుంది. పాత మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త తరం వాచ్ లో గూగుల్ చాలా పెద్ద బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల వాచ్ బ్యాటరీ బ్యాకప్ మునుపటి కంటే చాలా ఎక్కువగా వస్తుందని టెక్ వర్గాల అంచనా. కస్టమర్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఇందులో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, స్పూ2 వంటి అనేక రకాల అడ్వాన్స్‌డ్ సెన్సార్లను కూడా చేర్చనున్నారు.
ఈ వాచ్ ధరకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన లీక్ కూడా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ సుమారు రూ. 4,500 ($50 USD కంటే ఎక్కువ) ధర పరిధిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సరికొత్త గూగుల్ పిక్సెల్ వాచ్ 5ను కంపెనీ ఆగస్టు 12న అధికారికంగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్పెసిఫికేషన్లు, కలర్స్ లేదా లాంచ్ డేట్ గురించి గూగుల్ కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains