స్క్రీన్ విషయంలో మూడూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి.
Photo Credit: OnePlus/Vivo/Tecno
OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G
OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : భారత మార్కెట్లో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం వన్ ప్లస్, భారత్‌లో వన్ ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వివో T5 లైట్ 5G, టెక్నో స్పార్క్ 50 5G మోడళ్లకు ప్రత్యక్ష పోటీని ఇస్తోంది. రూ. 20,000 బడ్జెట్ విభాగంలో పోటీపడుతున్న ఈ మూడు 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఏది మంచి ఆప్షన్? వీటి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో పోల్చి చూద్దాం.
ధరలు, వేరియంట్ల వివరాలు
వన్ ప్లస్ N6x: ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB+128GB వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.
వివో T5 లైట్ 5G: ఇందులో 4GB+128GB మోడల్ ధర రూ. 19,999, 6GB+128GB ధర రూ. 21,999, 6GB+256GB టాప్ వేరియంట్ ధర రూ. 24,499 గా నిర్ణయించారు.
టెక్నో స్పార్క్ 50 5G: దీని 4GB+128GB మోడల్ రూ. 19,999 కి లభిస్తుండగా, 6GB+128GB మోడల్ ధర రూ. 22,999 గా ఉంది.
డిస్‌ప్లే క్వాలిటీ అండ్ బ్రైట్‌నెస్
స్క్రీన్ విషయంలో మూడూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి. వన్ ప్లస్ N6x ఫోన్ 6.8 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే (900 నిట్స్ బ్రైట్‌నెస్) తో వస్తుంది. వివో T5 లైట్ 5G లో 6.74 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే ఉంది, ఇది ఏకంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఇక టెక్నో స్పార్క్ 50 5G మోడల్ 6.78 ఇంచుల HD+ డిస్‌ప్లేతో 560 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్మూత్ రిఫ్రెష్ రేట్ మూడింటిలో ఉన్నా, వివో డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పరంగా ముందంజలో ఉంది.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
ప్రాసెసర్లు: వన్ ప్లస్ N6x లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 Apex చిప్‌సెట్ అందించగా, వివో T5 లైట్ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. టెక్నో స్పార్క్ 50 5G లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
సాఫ్ట్‌వేర్: ఈ మూడు ఫోన్లు తాజా ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే పనిచేస్తాయి. వన్ ప్లస్ ఆక్సిజన్ OS 16 తో, వివో ఆరిజిన్ OS 6.0 తో, టెక్నో HiOS 16 తో పనిచేస్తాయి.
కెమెరా విభాగాలు: దేని పవర్ ఎంత?
రియర్ కెమెరా: కెమెరా విషయంలో వివో, టెక్నోలు మెరుగైన ఆప్షన్లను ఇస్తున్నాయి. వివో T5 లైట్ 5G వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా + 0.8MP సెకండరీ కెమెరాతో వస్తుంది. టెక్నో స్పార్క్ 50 5G లో f/1.85 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. అయితే వన్ ప్లస్ N6x లో మాత్రం f/2.2 అపర్చర్, 10x డిజిటల్ జూమ్‌తో కేవలం 13MP ప్రైమరీ కెమెరా మాత్రమే అందించారు.
ఫ్రంట్ కెమెరా: వన్ ప్లస్ N6x, వివో T5 లైట్ 5G లలో సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాలు ఉండగా, టెక్నో స్పార్క్ 50 5G లో మెరుగైన 8MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ విభాగంలో వన్ ప్లస్ N6x రికార్డు స్థాయి పవర్‌తో ముందుంది. వన్ ప్లస్ N6x లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ అందించారు (15W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ మద్దతు). వివో T5 లైట్ 5G లో 6,500mAh బ్యాటరీతో పాటు 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే టెక్నో స్పార్క్ 50 5G లో కూడా 6,500mAh బ్యాటరీతో పాటు 45W వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. రోజంతా బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి వన్ ప్లస్, వేగవంతమైన ఛార్జింగ్ కావాలనుకునే వారికి వివో, టెక్నోలు బెటర్ ఆప్షన్లుగా నిలుస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale