సాధారణంగా రూ. 15,000 బడ్జెట్ ఫోన్లలో 5,000mAh బ్యాటరీ రావడం కామన్. కానీ ఒప్పో ఈ ఫోన్లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Photo Credit: Oppo
Oppo A6c (pictured) was launched in China in January this year
Oppo A6c 4G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారతీయ మార్కెట్లో తమ బడ్జెట్ శ్రేణిని మరింత విస్తరించింది. విదేశీ మార్కెట్లలో ఇప్పటికే విడుదలైన తమ సరికొత్త A సిరీస్ మొబైల్ Oppo A6c 4Gను ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది. సాధారణంగా రూ. 15,000 బడ్జెట్ ఫోన్లలో 5,000mAh బ్యాటరీ రావడం కామన్. కానీ ఒప్పో ఈ ఫోన్లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ షాపులలోనూ విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ, రెడ్మి బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీనిచ్చేలా ఈ మొబైల్‌ను డిజైన్ చేశారు.
ధరల విషయానికి వస్తే.. ఒప్పో A6c బేస్ వేరియంట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ధర రూ. 13,999 గా ఉంది. అలాగే దీని రెండవ మోడల్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ఫెదర్ వైట్, స్టోన్ బ్రౌన్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
ఫీచర్ల పరంగా చూస్తే, ఒప్పో A6c లో 6.75-ఇంచుల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,125 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని 7,000mAh బ్యాటరీ. దీనికి తోడు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇతర ఫోన్లను ఛార్జ్ చేసుకునేలా రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ మామూలుగా వాడే వాళ్లకు వరుసగా రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
పెర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. మార్కెట్లో కాంపోనెంట్ ధరలు పెరగడం వల్లే ఇండియాలో కేవలం 4GB ర్యామ్ మోడల్‌ను మాత్రమే తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వబడింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Reddit to Require Users to Log in to Browse Platform, Testing to Begin Soon
Samsung Galaxy Fit 4 Features Allegedly Revealed Through Companion App Teardown