Oppo Reno 13, Reno 13 Proల‌తోపాటు మ‌రో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేస్తున్నాయి..

Oppo Reno 13, Reno 13 Proల‌తోపాటు మ‌రో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేస్తున్నాయి..

Photo Credit: Oppo

Oppo Reno 13F 5G గ్రాఫైట్ గ్రే, లూమినస్ బ్లూ మరియు ప్లూమ్ పర్పుల్ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • Oppo Reno 13F 5G, Reno 13F 4Gలు 5,800mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి
  • ఈ హ్యాండ్‌సెట్‌లు 45W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి
  • Oppo Reno 13F హ్యాండ్‌సెట్‌లు ColorOS 15తో ర‌న్ అవుతాయి
ప్రకటన

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో Oppo Reno 13, Reno 13 Pro హ్యాండ్‌సెట్‌లు చైనాలో విడుద‌లైన త‌ర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ గ్లోబల్ లాంచ్‌తో పాటు Oppo Reno 13F 5G, Reno 13F 4G అనే రెండు కొత్త వేరియంట్‌లు కూడా వ‌స్తున్నాయి. Oppo Reno 13F వేరియంట్‌లలో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌, 45W వైర్డు SuperVOOC ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,800mAh బ్యాటరీల‌ను అందించారు. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్న‌ట్లు కంపెనీ చెబుతోంది.

వేరియంట్‌లు ఇలా

Oppo Reno 13F 5G ఫోన్‌ 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్‌లలో ల‌భిస్తున్నాయి. అలాగే, Oppo Reno 13F 4G ఫోన్ 8GB + 256GB, 8GB + 512GB వేరియంట్‌ల‌లో అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అయితే, గ్లోబల్ మార్కెట్లలో Oppo Reno 13 సిరీస్ హ్యాండ్‌సెట్‌ల ధర వివరాలను Oppo ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

జనవరి 9న మ‌న దేశంలో

Oppo Reno 13F రెండు మోడల్స్ కూడా గ్రాఫైట్ గ్రే, ప్లూమ్ పర్పుల్ కలర్‌వేస్‌లో అందుబాటులోకి రానున్నాయి. 5G వేరియంట్ థ‌ర్డ్‌ లూమినస్ బ్లూ షేడ్‌లో వస్తుండ‌గా, 4G వెర్షన్ స్కైలైన్ బ్లూలో ల‌భిస్తుంది. అంతేకాదు, Oppo Reno 13, Reno 13 Proలు జనవరి 9న మ‌న దేశంలో లాంచ్ కానున్నాయి. అయితే, Reno 13F స్మార్ట్ ఫోన్‌లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయ‌న్న విష‌యాన్ని కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

వేరు వేరు ప్రాసెస‌ర్‌లు

ఈ Oppo Reno 13F 5G, Reno 13F 4G స్పోర్ట్ 6.67-అంగుళాల ఫుల్‌-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ లెవెల్‌, AGC DT స్టార్ 2 ప్రొట‌క్ష‌న్‌తో వ‌స్తున్నాయి. 5G వేరియంట్ Snapdragon 6 Gen 1 ప్రాసెస‌ర్‌ ద్వారా 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయ‌బ‌డింది. ఇక 4G వెర్షన్ MediaTek Helio G100 ప్రాసెస‌ర్‌తోపాటు 8GB LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వ‌స్తోంది. ఈ రెండు ఫోన్‌లు Android 15-ఆధారిత ColorOS 15తో ర‌న్ చేయ‌బ‌డుతున్నాయి.

32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

Oppo Reno 13F 5G, Reno 13F 4G ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌తోపాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో యూనిట్‌ను పొందుతున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే, భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ విష‌యానికి వ‌స్తే.. Wi-Fi, బ్లూటూత్, GPS, NFC మరియు USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇండియాలో మే 27న Alcatel V3 5G సిరీస్ లాంఛ్‌.. పూర్తి వివ‌రాలు ఇవే
  2. దేశీయ మార్కెట్‌లోకి Sony Bravia 2 II సిరీస్ టీవీలు.. ధ‌ర‌తోపాటు ఫీచ‌ర్స్ చూసేయండి
  3. డీప్ థింక్ మోడ్, నేటివ్ ఆడియో అవుట్‌పుట్‌తో జెమిని 2.5 AI మోడల్స్ అప్‌గ్రేడ్
  4. జూన్ 9 నుండి జూన్ 13 వరకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జ‌ర‌గ‌నున్న‌ WWDC 2025
  5. మే 29న VIVO S30, S30ప్రో మినీ పాటు VIVO పాడ్ 5, TWS ఎయిర్ 3 లాంచ్
  6. Realme GT 7T త్వరలో లాంచ్.. లీకైన కలర్, డిజైన్ ఫీచర్లు
  7. రూ. 10,000 లోపు ధ‌ర‌లో Lava Shark 5G.. ఇండియాలో మే 23న లాంఛ్‌
  8. ఇండియాలో Alcatel V3 Ultraతోపాటు Alcatel V3 క్లాసిక్‌, Alcatel V3 ప్రో లాంఛ్‌కు స‌న్నాహాలు
  9. ఐకూ నియో 10 ప్రో+ త్వరలో విడుదల.. ఆకర్షిస్తున్న ఫీచర్లు
  10. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న Realme GT7... లాంచింగ్ ఎప్పుడంటే..?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »