Discount on Oppo Reno 15C: ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ సాధారణంగా మార్కెట్లో రూ.42,999 ధరకు లిస్ట్ అవుతుంది.
Photo Credit: Oppo Reno 15c
Oppo Reno 15c
Discount on Oppo Reno 15C: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తమ సూపర్ హిట్ మోడల్ ఒప్పో రేనో 15సీ 5జీ పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్ ఈ ఫోన్‌ను ఎంఆర్‌పీ కంటే చాలా తక్కువ ధరకే కస్టమర్లకు అందిస్తోంది. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశంగా టెక్ ప్రియులు భావిస్తున్నారు.
ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ సాధారణంగా మార్కెట్లో రూ.42,999 ధరకు లిస్ట్ అవుతుంది. అయితే విజయ్ సేల్స్ ప్రస్తుత సేల్‌లో దీనిపై నేరుగా 2 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల రూ.1,000 తగ్గి ఫోన్ రూ.41,999 లకే లభిస్తుంది. అయితే అసలైన భారీ ఆఫర్ బ్యాంక్ కార్డులపై ఉంది. మీరు కనుక ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా మరో రూ.4,200 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే కస్టమర్లకు మొత్తంగా రూ.5,200 వరకు భారీ తగ్గింపు అందుతోంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత లభిస్తున్న అత్యంత తక్కువ ధర ఇదే కావడం గమనార్హం.
ఈ ఫోన్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్లు చాలా బరువుగా, లావుగా ఉంటాయి. కానీ ఒప్పో దీనిని కేవలం 8.14 మిమీ మందం, 195 గ్రాముల బరువుతోనే ఎంతో స్లిమ్‌గా డిజైన్ చేసింది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. దీనివల్ల ఫోన్ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
Indigo : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 49 కే క్యాబ్ సర్వీస్ ప్రారంభించిన ఇండిగో
ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 2372×1080 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం స్క్రీన్ పైనే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి ఏకంగా IP66, IP68, IP69 ట్రిపుల్ రేటింగ్స్ ఇవ్వడం విశేషం.
ఫోటోగ్రఫీ పరంగా కూడా ఒప్పో రేనో 15సీ అదరగొడుతుంది. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను అందించారు. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్‌తో కూడిన పవర్‌ఫుల్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం సెల్ఫీ ప్రియులకు ఒక పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన