గూగుల్ ప్లే కన్సోల్‌లో డేటాబేస్‌లో ‘2508CPC2BI’ మోడల్ నంబర్‌ను కలిగి ఉన్న POCO C85 5G స్మార్ట్‌ఫోన్ లిస్ట్ చేయబడింది. ఇందులో ‘I’ అంటే ఇండియా అని తెలిసిందే.
POCO C85 5G (గూగుల్ ప్లే కన్సోల్ ఫ్రంట్ లుక్‌ను ఆవిష్కరించింది)
భారతదేశంలో త్వరలో లాంఛ్ కానున్న POCO C85 5G స్మార్ట్‌ఫోన్ ఇండియన్ వేరియంట్ ఇప్పుడు Google Play Console డేటాబేస్‌లో కనిపించింది. ఇక దాని ప్రకారం ఈ మోడల్ కీలక అంశాలు, కీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేశాయి. అదనంగా ఈ న్యూ మోడల్ ఫ్రంట్ లుక్ ఇమేజ్ కూడా డేటాబేస్ ద్వారా లీక్ అయింది. ఈ ఫోన్ దాదాపు MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌తో రానుంది. అంతే కాకుండా 20 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇది సెప్టెంబర్ 2025లో వచ్చిన POCO C85 4Gకి అప్డేటెడ్ వర్షెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ న్యూ మోడల్ ఫోన్‌కు సంబంధించిన కీ ఫీచర్స్, డిజైన్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Google Play Console డేటాబేస్‌లో ‘2508CPC2BI' మోడల్ నంబర్‌ను కలిగి ఉన్న POCO C85 5G స్మార్ట్‌ఫోన్ లిస్ట్ చేయబడింది. ఈ మోడల్ నంబర్‌లోని ‘I' అది ఇండియన్ వేరియంట్ అని తెలిసిందే. ఈ పరికరానికి కోడ్‌నేమ్ ‘టోర్నడో' ఉంది. ఇది 4GB RAM వేరియంట్ అని గుర్తించబడింది. ఇది MediaTek Dimensity 6100+ చిప్‌సెట్ (మోడల్ నంబర్ - 'MT6835'; CPU ఆర్కిటెక్చర్ - 2x ARM కార్టెక్స్ A76 కోర్లు 2.20 GHz + 6x ARM కార్టెక్స్ A55 కోర్లు 2.00 GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి)ని ఉపయోగించారని చూపించారు. ARM Mali G57 GPU (962 MHz)తో ఇంటిగ్రేట్ చేశారని తెలుస్తోంది.
720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ డిస్‌ప్లే కూడా పరికరంలో భాగమని వెల్లడైంది. ఇది 320 xhdpi పిక్సెల్ డెన్సిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ లిస్టింగ్ ప్రకారం Android 16 బీటా (SDK 36)తో ఈ పరికరం నడుస్తుంది. రివీల్ చేయబడిన ఫ్రంట్ లుక్ డిజైన్ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లే స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దానితో పాటు మూడు వైపులా సన్నని బెజెల్స్ ఉంటాయి. దిగువన మందంగా ఉంటుంది. ఈ పరికరం వాటర్-డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. కుడి వైపు ప్యానెల్‌లో, వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ కూడా కనిపిస్తాయి.
ఇంకా చెప్పాలంటే గతంలో ఇదే పరికరం BIS సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కూడా కనిపించింది. తద్వారా భారత మార్కెట్‌కు దాని రాకను కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 2025లో POCO C85 4G స్మార్ట్‌ఫోన్ కూడా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ మోడల్‌కి సంబంధించి ఇలాంటి అప్‌డేట్ల కోసం ఎదురుచూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon