ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. రూ.3,000 డిస్కౌంట్, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్.. డోంట్ మిస్..!

పోకో ఎక్స్8 సిరీస్, ఇప్పుడు అధికారికంగా భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఈరోజే ఫ్లిప్‌కార్ట్ వేదికగా సేల్‌కు వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. రూ.3,000 డిస్కౌంట్, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్.. డోంట్ మిస్..!

Photo Credit: Flipkart/ Poco

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ

ముఖ్యాంశాలు
  • పోకో ఎక్స్8 ప్రో 5జీ, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ
  • బేస్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ.32,999
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్
ప్రకటన

మార్చి 17న గ్లోబల్ మార్కెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పోకో ఎక్స్8 సిరీస్, ఇప్పుడు అధికారికంగా భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఈరోజే ఫ్లిప్‌కార్ట్ వేదికగా సేల్‌కు వచ్చింది. ఈ సరికొత్త సిరీస్‌లో పోకో ఎక్స్8 ప్రో 5జీ,  పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. షియోమీకి చెందిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3తో నడుస్తున్న ఈ ఫోన్లు, టెక్నాలజీ పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. కేవలం స్పెసిఫికేషన్లు మాత్రమే కాకుండా, ఈ ఫోన్ల డిజైన్, కలర్ ఆప్షన్లు కూడా యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు విభిన్న రంగుల్లో, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒక బలమైన పోటీని ఇస్తున్నాయి.

ధరల విషయానికి వస్తే, పోకో ఎక్స్8 ప్రో 5జీ బేస్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ.32,999గా నిర్ణయించగా, 12GB + 256GB వేరియంట్ రూ.35,999కి లభిస్తోంది. ప్రత్యేకంగా ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఇష్టపడే వారి కోసం రూ.37,999 ధరతో ఒక స్పెషల్ వేరియంట్‌ను కూడా పోకో పరిచయం చేసింది. ఇక ఈ సిరీస్‌లో హై-ఎండ్ మోడల్ అయిన పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీ విషయానికి వస్తే, 12GB + 256GB వేరియంట్ రూ.42,999కి, 12GB + 512GB వేరియంట్ రూ.46,999కి అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులకు మొదటి సేల్‌లో భాగంగా రూ.3,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది, ఇది కస్టమర్లకు ఒక గొప్ప డీల్ అని చెప్పవచ్చు.

డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ పరంగా పోకో ఎక్స్8 సిరీస్ అద్భుతమనే చెప్పాలి. ప్రో మోడల్‌లో 6.83 అంగుళాల 1.5కె అమోలెడ్ స్క్రీన్ ఉండగా, ప్రో మాక్స్ మోడల్‌లో 6.59 అంగుళాల ప్యానెల్‌ను అమర్చారు. రెండు ఫోన్లలోనూ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్,  3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత విశేషమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్లు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె రేటింగులతో వస్తున్నాయి. అంటే ధూళి,  నీటి నుండి ఈ ఫోన్లకు అత్యున్నత స్థాయి రక్షణ ఉంటుంది. ఇంతటి కఠినమైన రేటింగ్స్ ఉన్న ఫోన్లు ఈ ధరలో లభించడం నిజంగా అరుదు.

poco x8 pro max 5g india launch main

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ 5జీలో శక్తివంతమైన 3ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్ ఉంది, దీనికి తోడు 12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ అల్ట్రా ర్యామ్ తోడైంది. ఇక స్టాండర్డ్ ప్రో మోడల్‌లో 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ఎస్ఓసీని వాడారు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 'పోకో 3డీ ఐస్ లూప్' కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో ప్రవేశపెట్టారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా లేదా మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేసేలా దీనిని డిజైన్ చేశారు. స్టోరేజ్ పరంగా కూడా యుఎఫ్ఎస్ 4.1 టెక్నాలజీని వాడటం వల్ల డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది.

కెమెరా విభాగంలో పోకో తనదైన ముద్ర వేసింది. రెండు మోడళ్లలోనూ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. దీనితో పాటు 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇచ్చే 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ కెమెరాల ద్వారా 4కె రిజల్యూషన్‌లో సెకనుకు 60 ఫ్రేమ్ల వేగంతో ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారికి, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారికి ఇది ఒక బెస్ట్ కెమెరా ఫోన్ అవుతుంది.

బ్యాటరీ సామర్థ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోకో ఎక్స్8 ప్రో మాక్స్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అమర్చగా, ప్రో మోడల్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. ఈ భారీ బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల మీ ఫోన్‌తో ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. వినియోగదారులకు అదనపు ప్రయోజనంగా రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం, మూడు నెలల స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్లు. ఫీచర్లు చూస్తుంటే, పోకో ఎక్స్8 సిరీస్ మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »