నాలుగు స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో Realme 15 5G హ్యాండ్‌సెట్ అందుబాటులోకి.. నివేదిక‌లు ఏం చెబుతున్నాయంటే

ఈ Realme 15 5G గతంలో వచ్చిన Realme 14 5Gకి కొనసాగింపుగా రానుంది. తాజాగా లిక్ అయిన దీని ఫీచ‌ర్స్ తోపాటు ధరల వివరాలను చూద్దాం

నాలుగు స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో Realme 15 5G హ్యాండ్‌సెట్ అందుబాటులోకి.. నివేదిక‌లు ఏం చెబుతున్నాయంటే

Photo Credit: Realme

Realme 14 5G (చిత్రంలో) స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 SoC ని కలిగి ఉంది మరియు దాని వారసుడిని ప్రారంభించడం త్వరలో జరుగుతుంది

ముఖ్యాంశాలు
  • Realme 14 5Gతో పోల్చి చూస్తే, పూర్తి అప్‌గ్రేడ్‌ల‌తో Realme 15 5G
  • 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB నాలుగు స్టోరేజీ వేరి
  • ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియ‌ల్ కెమెరా యూనిట్ తో వ‌చ్చే అవ‌కాశం
ప్రకటన

Realme తాజా బడ్జెట్ ఫోన్ Realme 15 5G ని మన దేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6300mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు ఓ నివేదిక ఆధారంగా బహిర్గతం అయ్యింది. అంతే కాదు, దీనికి సంబంధించిన కలర్ ఆప్షన్లతోపాటు RAM, స్టోరేజీ సామర్థ్యం వంటి వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ Realme 15 5G గతంలో వచ్చిన Realme 14 5Gకి కొనసాగింపుగా రానుంది. తాజాగా లిక్ అయిన దీని ఫీచ‌ర్స్ తోపాటు ధరల వివరాలను చూద్దాం.మూడు కలర్ ఆప్షన్ ల‌లో,91Mobiles నివేదిక ప్రకారం.. రాబోయే Realme 15T 5G మన దేశంలో RMX5106 మోడల్ నెంబర్లో విడుదల కానుంది. ఇది 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB మొత్తం నాలుగు స్టోరేజీ వేరియంట్లలో లభించనుంది. అయితే, వీటి ధరలు రూ. 18,000 నుంచి రూ. 20,000 మద్య ఉంటే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ సిల్స్ పింక్, ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్ ల‌లో లభించనుంది.6300mAh బ్యాట‌రీతో,ఈ నివేదిక ప్ర‌క‌రాం, కొత్త Realme 15T 5G ఫోన్ స్పాప్‌డ్రాగ‌న్ 7 జెన్ 4 ప్రాసెస‌ర్‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రాసెస‌ర్ వేగవంత‌మైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంద‌ని చెబుతున్నారు. అలాగే, ఇది 45 W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6300mAh బ్యాట‌రీతో రూపొందించ‌బ‌డుతోంది. దీని ఆక‌ర్ష‌ణీయ‌మైన క‌ల‌ర్ ఆప్ష‌న్ లు అమ్మ‌కాల‌ను మ‌రింత పెంచుతాయ‌ని కంపెనీ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ట్రిపుల్ రియ‌ల్ కెమెరా యూనిట్

రాబోయే స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే విష‌యానికి వ‌స్తే, దీనికి 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను అందించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియ‌ల్ కెమెరా యూనిట్ తో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనిలో ఓఐఎస్ తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించ‌నున్నారు. దీంతో పాటు ఈ ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా క‌లిగి ఉంటుంది.

Realme 14 5Gతో పోల్చి చూస్తే

మొత్తంగా రాబోయే ఈ Realme 15 5G ఫోన్ గ‌త మార్చి నెల‌లో వ‌చ్చిన Realme 14 5Gతో పోల్చి చూస్తే, పూర్తి అప్‌గ్రేడ్‌ల‌లో రానున్న‌ట్లు అంచ‌నా. Realme 14 మోడ‌ల్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 4 ప్రాసెస‌ర్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. అలాగే, ఇది 45 W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6000mAh బ్యాట‌రీని క‌లిగి ఉంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 50 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లోకి వ‌చ్చింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »