Smartphone Price : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్ల ధరలు భారీగా పెంపు

రియల్‌మీ ఈ ఏడాది రిలీజ్ చేసిన పాపులర్ 16 సిరీస్ ఫోన్ల ధరలు ఇప్పుడు మునుపటి కంటే చాలా కాస్ట్లీగా మారాయి

Smartphone Price : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్ల ధరలు భారీగా పెంపు

Poco M8 5G now costs Rs. 20,999 for the base 6GB + 128GB variant

ముఖ్యాంశాలు
  • మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
  • రియల్‌మీ 16 సిరీస్‌తో పాటు వన్‌ప్లస్, పోకో, లావా బ్రాండ్ల ధరల పెంపు
  • కొత్త రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రకటన

Smartphone Price : కొత్త మొబైల్ కొందామని బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్న కస్టమర్లకు మొబైల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. భారతదేశంలో మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న రియల్‌మీ 16 సిరీస్‌తో పాటు వన్‌ప్లస్, పోకో, లావా వంటి టాప్ బ్రాండ్ల మొబైల్స్ ధరలను కంపెనీలు భారీగా సవరించాయి. గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ఖర్చులు విపరీతంగా పెరగడం, అలాగే మెమరీ చిప్‌ల కొరత ఏర్పడటంతో కంపెనీలపై ఆర్థిక భారం పడింది. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల నెత్తినే వేస్తూ మిడ్-రేంజ్, ప్రీమియం ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.

రియల్‌మీ 16 సిరీస్ ధరల పెంపు.. 
రియల్‌మీ ఈ ఏడాది రిలీజ్ చేసిన పాపులర్ 16 సిరీస్ ఫోన్ల ధరలు ఇప్పుడు మునుపటి కంటే చాలా కాస్ట్లీగా మారాయి. బేస్ మోడల్ అయిన రియల్‌మీ 16 (8GB + 128GB) వేరియంట్ లాంచ్ ధర రూ.31,999 ఉండగా, ఇప్పుడు దానిని రూ.33,999 కి పెంచారు. అలాగే దీని 8GB + 256GB మోడల్ రూ.36,999కి, 12GB + 256GB టాప్ మోడల్ రూ.39,999కి చేరాయి. మరోవైపు రియల్‌మీ 16 ప్రో మోడల్ బేస్ వేరియంట్ ఏకంగా ఐదు వేలు పెరిగి ఇప్పుడు రూ.36,999కి విక్రయించబడుతోంది. దీని హయ్యర్ వేరియంట్లు అయిన 8GB + 256GB, 12GB + 256GB మోడల్స్ వరుసగా రూ.39,999, రూ.42,999 ధరకు చేరుకున్నాయి. ఇక అత్యంత ప్రీమియం మోడల్ అయిన రియల్‌మీ 16 ప్రో ప్లస్ 5G వేరియంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీని 8GB + 256GB మోడల్ రూ.48,999కి (లాంచ్ ధర రూ. 41,999), 12GB + 256GB మోడల్ రూ.52,999కి (లాంచ్ ధర రూ.44,999) సవరించబడ్డాయి.

వన్‌ప్లస్ 15R పై మళ్లీ పెరిగిన భారం..  
ప్రీమియం లుక్ , పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో లభించే వన్‌ప్లస్ 15R మొబైల్ ధరను కంపెనీ మరోసారి పెంచేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్ సరికొత్త ధరలతో లిస్ట్ అయింది. లాంచ్ సమయంలో రూ.47,999కి అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 15R (12GB + 256GB) బేస్ మోడల్ ధర ఇప్పుడు ఏకంగా రూ.54,999కి చేరుకుంది. అంటే కస్టమర్లపై ఏకంగా ఏడు వేల రూపాయల అదనపు భారం పడింది. ఇదే వేరియంట్‌లో వచ్చే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర మునుపటి లాంచ్ ప్రైస్ రూ.52,999 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.59,999 కి పెరిగిపోయింది. వన్‌ప్లస్ బ్రాండ్ వాల్యూని నమ్మి కొనేవారి జేబులకు ఇది గట్టి దెబ్బేనని చెప్పాలి.

పోకో, లావా స్మార్ట్‌ఫోన్లు కూడా ప్రియం..  
ధరల పెంపు రేసులో పోకో, స్వదేశీ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ కూడా చేరిపోయాయి. పోకోకు చెందిన పవర్‌ఫుల్ మోడల్ పోకో X8 ప్రో మాక్స్ (12GB + 256GB) ధర రూ.42,999 నుంచి రూ.44,999కి పెరిగింది. కాగా దీని 512GB స్టోరేజ్ మోడల్ మాత్రం పాత ధర రూ.48,999 వద్దే కొనసాగుతోంది. ఇక బడ్జెట్ రేంజ్ 5G ఫోన్ అయిన పోకో M8 5G బేస్ మోడల్ (6GB + 128GB) ధర రూ.18,999 నుంచి రూ.20,999కి పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ రూ.22,999కి, 8GB + 256GB వేరియంట్ రూ.24,999కి చేరాయి. ఇదే దారిలో లావా అగ్ని 4 ఏకైక 8GB + 256GB వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.24,999 నుంచి ఏకంగా రూ.29,999కి పెరిగిపోయింది.

ఎందుకీ హఠాత్ నిర్ణయం?
ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్లు మరియు మార్కెట్ నిపుణుల సమాచారం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ల తయారీకి అవసరమయ్యే ప్రాసెసర్లు, కెమెరా సెన్సార్ల ధరలు గ్లోబల్ మార్కెట్లో భారీగా పెరిగాయి. వీటన్నింటికీ మించి స్మార్ట్‌ఫోన్లలో వాడే DRAM, NAND లాంటి మెమరీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, సప్లై తక్కువగా ఉండటం వల్ల చిప్‌ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ కారణంగానే మొబైల్ కంపెనీలు తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని బ్రాండ్లు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Product Name New Price Launch Price
Realme 16 (8GB + 128GB) Rs. 33,999 Rs. 31,999
Realme 16 Pro+ 5G (8GB+256GB) Rs. 48,999 Rs. 41,999
Realme 16 Pro (8GB+128GB) Rs. 36,999 Rs. 31,999
OnePlus 15R (12GB + 256GB) Rs. 54,999 Rs. 47,999
Poco X8 Pro Max (12GB + 256GB) Rs. 44,999 Rs. 42,999
Poco M8 5G (6GB + 128GB) Rs. 20,999 Rs. 18,999
Lava Agni 4 (8GB + 256GB) Rs. 29,999 Rs. 24,999

 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »