Realme : మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మి 16T.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు!

రియల్‌మి 16T మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ (6GB రామ్ + 128GB స్టోరేజ్) ధర రూ.29,999లుగా ఉంది.

Realme : మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మి 16T.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు!

Realme 16T comes with an IP69 Pro rating for dust and water resistance

ముఖ్యాంశాలు
  • Realme 16T packs an 8,000mAh battery with 45W charging
  • The smartphone runs Android 16-based Realme UI 7
  • A 13,280 sq mm cooling system helps manage thermals
ప్రకటన

Realme : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి భారత కస్టమర్ల కోసం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 16Tని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌తో పాటు  రియల్‌మి బడ్స్ ఎయిర్ 8 ప్రో, రియల్‌మి వాచ్ S5లను కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా రెండు విషయాల కోసం డిజైన్ చేయబడింది. ఒకటి అస్సలు అయిపోని కొండంత బ్యాటరీ లైఫ్, రెండు రఫ్ అండ్ టఫ్ వాడుకకు తట్టుకునే బలమైన బాడీ. రూ.30 వేల బడ్జెట్ పరిధిలో 144Hz అదిరిపోయే స్క్రీన్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో పాటు మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

ధరల విషయానికి వస్తే.. రియల్‌మి 16T మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ (6GB రామ్ + 128GB స్టోరేజ్) ధర రూ.29,999లుగా ఉంది. అలాగే 8GB రామ్ + 128GB మోడల్ ధర రూ.31,999లు కాగా, టాప్ ఎండ్ వెర్షన్ అయిన 8GB రామ్ + 256GB మోడల్ ధర రూ.34,999లుగా నిర్ణయించారు. ఇది స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌లైట్ రెడ్ (లేదా అరోరా గ్రీన్) రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా యూపీఐ, బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత రియల్‌మి యూజర్లకు అదనంగా రూ.1,000 లాభం, 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. మొదటి సేల్ మే 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుకానుంది.

ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 144Hz హై రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించడం కోసం ఇందులో 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, సన్ డిస్‌ప్లే  టెక్నాలజీని వాడారు. కంటి రక్షణ కోసం ఐ ప్రొటెక్షన్ మోడ్, డార్క్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెнసిటీ 6300 ప్రొసెసర్‌ను ఉపయోగించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7తో పనిచేస్తుంది. ఐఫోన్ (iOS) వినియోగదారులతో సులభంగా ఫైల్స్ షేర్ చేసుకునే ప్రత్యేక సపోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం విశేషం.

ఫొటోగ్రఫీ కోసం రియల్‌మి 16T వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రధాన కెమెరా, దానితో పాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాలో లుమాకలర్ ఇమేజ్ ఇంజిన్ వాడారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో స్కిన్ టోన్స్, ఫొటో టెక్స్చర్‌ను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక చిన్న సెల్ఫీ మిర్రర్ అమర్చారు. దీనివల్ల ఎక్కువ క్వాలిటీ ఉండే వెనుక కెమెరాతోనే మన ముఖం చూసుకుంటూ ఈజీగా సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇక స్క్రీన్ పైభాగంలో హోల్-పంచ్ డిజైన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఎంతో బలంగా ఉంటుంది. దీనికి పరిశ్రమలోనే అత్యున్నతమైన ఐపీ69 రేటింగ్ ఉంది. అంటే ఎక్స్‌ట్రీమ్ వాటర్ ప్రెజర్, వేడి నీటిని కూడా ఇది తట్టుకోగలదు. అంతేకాకుండా, దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్-రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే ప్రయాణాల్లో లేదా బైక్ పై వెళ్లేటప్పుడు ఫోన్ పొరపాటున కింద పడినా సరే ఏమీ కానంత బలంగా దీనిని తయారుచేశారు. స్క్రీన్‌కు రక్షణగా పాండా గ్లాస్‎ను వాడారు. ఫోన్ వేడెక్కకుండా చూడటం కోసం ఇందులో 13,280 చదరపు మిల్లీమీటర్ల భారీ వేపర్ ఛాంబర్,గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆడియో పరంగా 400 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను సపోర్ట్ చేసే పవర్‌ఫుల్ లీనియర్ స్పీకర్లు ఉన్నాయి.

రియల్‌మి 16T ఫోన్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 8,000mAh టైటాన్ బ్యాటరీని వాడారు. ఒక్కసారి చార్జ్ చేస్తే సాధారణ వాడకంలో ఈ ఫోన్ ఏకంగా మూడు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 45W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి దాదాపు 104 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో బైపాస్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంది, దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు పవర్ నేరుగా మదర్‌బోర్డుకు వెళ్లి ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ద్వారా ఇతర డివైజ్‌లను చార్జ్ చేసుకోవడానికి 6.5W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బ్యాటరీ 7 సంవత్సరాల పాటు మంచి హెల్త్‌తో ఉంటుందని, అలాగే ఫోన్ 6 ఏళ్ల పాటు ఎలాంటి హ్యాంగ్ లేకుండా సూపర్ స్మూత్‌గా పనిచేస్తుందని రియల్‌మి హామీ ఇస్తోంది. ఫోన్ బరువు 224 గ్రాములు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  2. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  3. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  4. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  5. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  6. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  7. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
  8. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  9. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  10. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »