Oneplus Nord CE6 Lite Vs Realme P4R Vs Poco M8: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.18,000 నుంచి రూ.25,000 ధరల సెగ్మెంట్‌కు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది
Photo Credit: Realme/OnePlus/Poco
Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G
Oneplus Nord CE6 Lite Vs Realme P4R Vs Poco M8 Comparison: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.18,000 నుంచి రూ.25,000 ధరల సెగ్మెంట్‌కు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ బడ్జెట్ రేంజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ సంస్థ రియల్‌మీ తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P4R 5Gని దేశీయంగా విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌కు మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నోర్డ్ CE6 లైట్, షావోమి సబ్ బ్రాండ్ నుంచి పోకో M8 5G ఫోన్లు ముందే సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు మోడల్స్ మధ్య ఉన్న ధరలు, స్పెసిఫికేషన్ల తేడాలను వివరంగా చూద్దాం.
ధరలు, స్టోరేజ్ వేరియంట్ల వివరాలు..
ధరల విషయానికి వస్తే.. రియల్‌మీ P4R 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని 4GB+128GB బేస్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6GB+128GB ధర రూ.20,999, 6GB+256GB టాప్ మోడల్ ధర రూ.22,999 గా ఉంది. ఇక వన్‌ప్లస్ నోర్డ్ CE6 లైట్ విషయానికి వస్తే, దీని 6GB+128GB వేరియంట్ ధర రూ.22,999, 8GB+128GB ధర రూ.25,999 గా నిర్ణయించారు. వీటికి భిన్నంగా పోకో M8 5G మోడల్ కాస్త తక్కువ ధరకే లభిస్తోంది. దీని 6GB+128GB వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8GB+128GB స్మార్ట్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. బడ్జెట్ పరంగా పోకో, రియల్‌మీలు ముందంజలో ఉన్నాయి.
డిస్‌ప్లే, స్క్రీన్ క్వాలిటీ లో తేడాలు..
డిస్‌ప్లే విభాగంలో పోకో కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే పోకో M8 5Gలో అత్యంత ప్రీమియం లుక్ ఇచ్చే 6.77 ఇంచుల 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరోవైపు, రియల్‌మీ P4R 5G లో 6.8 ఇంచుల HD+ సన్‌లైట్ స్క్రీన్‌ను ఇచ్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇక వన్‌ప్లస్ నోర్డ్ CE6 లైట్ లో 6.72 ఇంచుల ఫుల్ HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అమర్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇక్కడ పోకో డిస్‌ప్లే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పాలి.
ఇంజిన్ పవర్, ఆపరేటింగ్ సిస్టమ్..
పర్ఫార్మెన్స్ పరంగా ఈ మూడు ఫోన్లు వేర్వేరు బ్రాండ్ల ప్రాసెసర్లతో రన్ అవుతాయి. రియల్‌మీ P4R 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉండగా.. వన్‌ప్లస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎపెక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కాగా పోకో M8 5Gలో అడ్వాన్స్డ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చడం విశేషం. సాఫ్ట్‌వేర్ పరంగా రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0, OxygenOS 16లతో పనిచేస్తాయి. కానీ పోకో మాత్రం ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 తో నడుస్తుంది.
కెమెరా, సెల్ఫీ సెటప్..
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మూడు ఫోన్ల వెనుక భాగంలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలను అందించారు. అయితే వన్‌ప్లస్ లో ఓమ్నివిజన్ OV50D40 సెన్సార్‌తో పాటు ఈఐఎస్ సపోర్ట్, 2MP మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. పోకో లో కూడా 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా లభిస్తుంది. కానీ సెల్ఫీ విషయానికి వస్తే పోకో అందరికంటే టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే పోకో M8 5Gలో ఏకంగా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వగా.. రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్లలో కేవలం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి.
కనెక్టివిటీ ఆప్షన్లు, నెట్‌వర్క్..
కనెక్టివిటీ ఫీచర్లలో వన్‌ప్లస్, పోకో ఫోన్లు వై-ఫై 6, డ్యూయల్ 4G VoLTE కి సపోర్ట్ చేస్తాయి. అలాగే వన్‌ప్లస్ లో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంది. రియల్‌మీ P4R 5G లో మాత్రం వై-ఫై 5, బ్లూటూత్ 5.3 సపోర్ట్ మాత్రమే లభిస్తుంది. అయితే ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలోనూ కామన్‌గా ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను, జీపీఎస్ నావిగేషన్ సదుపాయాన్ని కంపెనీలు అందించాయి.
కొండలాంటి బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం..
బ్యాటరీ విభాగంలో రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్లు రికార్డులు సృష్టించాయి. రియల్‌మీ P4R 5Gలో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అమర్చారు, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే వన్‌ప్లస్ నోర్డ్ CE6 లైట్ లో 7000mAh బ్యాటరీతో పాటు 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. వీటికి భిన్నంగా పోకో M8 5Gలో సాధారణ 5,520mAh బ్యాటరీ మాత్రమే ఉంది, ఇది కూడా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ వారాల తరబడి కావాలనుకునే వారికి రియల్‌మీ, వన్‌ప్లస్ బెస్ట్ ఆప్షన్లు.
ప్రకటన
ప్రకటన