రెడ్‌మీ K100 ప్రొ మోడల్‌లో కస్టమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V సిరీస్ చిప్‌సెట్‌ను అందించబోతున్నారు.
Photo Credit: Redmi
Redmi K100 Pro Max
Redmi K100 Pro Max : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీ తమ నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ రెడ్‌మీ K100 ప్రొ సిరీస్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో కంపెనీ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌ను ఆగస్ట్ 11న చైనాలో లాంచ్ చేయనున్నారు. ఈ కొత్త లైనప్‌లో భాగంగా రెడ్‌మీ K100 ప్రొ, రెడ్‌మీ K100 ప్రొ మ్యాక్స్ అనే రెండు పవర్ఫుల్ మోడళ్లను పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, 40 లక్షలకు పైగా AnTuTu స్కోర్!
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, రెడ్‌మీ K100 ప్రొ మోడల్‌లో కస్టమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V సిరీస్ చిప్‌సెట్‌ను అందించబోతున్నారు. దీనితో పాటు గేమింగ్ ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి విడిగా 'AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్'ను కూడా చేర్చారు. రెడ్‌మీ అంతర్గత పరిశోధనల్లో (ఇంటర్నల్ టెస్టింగ్) ఈ స్మార్ట్‌ఫోన్ AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ కాంబినేషన్ స్కోర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఫోన్ పెర్ఫార్మెన్స్‌ను మరింత పెంచడానికి ఇందులో రేజింగ్ ఇంజిన్ టెక్నాలజీని జోడించారు.
185Hz రిఫ్రెష్ రేట్, 3D కూలింగ్ సిస్టమ్
గేమింగ్ వంటి భారీ టాస్క్‌లు చేసే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. డిస్‌ప్లే విభాగానికి వస్తే.. రెడ్‌మీ K100 ప్రొ మోడల్‌లో 6.59 ఇంచుల డిస్‌ప్లేను ఏకంగా 185Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందిస్తున్నారు. ఈ ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానెల్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. అందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. విశేషమేమిటంటే.. కెమెరా ఐలాండ్ భాగంలో ప్రముఖ ఆడియో బ్రాండ్ Sound by Bose బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్ కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఇవ్వబడ్డాయి.
Moto G Max : ఆగస్ట్ 15న మోటోరోలా నుంచి ‘మోటో జి మ్యాక్స్' గ్రాండ్ లాంచ్.. లీకైన ఫీచర్లు, ధర వివరాలు
9000mAh బ్యాటరీతో రానున్న రెడ్‌మీ K100 ప్రొ మ్యాక్స్
హై-ఎండ్ మోడల్ అయిన రెడ్‌మీ K100 ప్రొ మ్యాక్స్‌ను కాబర్నెట్ రెడ్ రంగులో ప్రదర్శించారు. దీనికి మ్యాచింగ్ మెటల్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల భారీ OLED డిస్‌ప్లేను అందించనున్నారు. అంతేకాకుండా.. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత భారీ బ్యాటరీలలో ఒకటైన ఏకంగా 9,000 mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రైమరీ కెమెరాగా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చబోతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పోకో బ్రాండింగ్‌తో
ఇటీవలే షియోమీ ప్రెసిడెంట్ లు వైబింగ్ మాట్లాడుతూ.. సాధారణ యూజర్లు, ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని బేస్ మోడల్ రెడ్‌మీ K100ని ప్రొ మోడల్స్ లాంచ్ అయిన తర్వాత పరిచయం చేస్తామని చెప్పారు. ఇక గ్లోబల్ మార్కెట్లో ఈ రెడ్‌మీ K100 ప్రొ, K100 ప్రొ మ్యాక్స్ మోడళ్లను వరుసగా పోకో F9 ప్రొ, పోకో F9 ఆల్ట్రా పేర్లతో రీబ్రాండ్ చేసి లాంచ్ చేసే అవకాశముంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains