షావోమి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించని ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ 2607DRA18C అనే మోడల్ నంబర్‌తో చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కనిపించింది.
Photo Credit: Redmi Note 15
Redmi Note 15 Pro has a 6,580mAh battery
Redmi Note 17 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎల్లప్పుడూ బడ్జెట్, మిడ్-రేంజ్ ధరల్లో క్రేజీ ఫీచర్లు ఇచ్చే రెడ్‌మి బ్రాండ్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతోంది. షావోమి సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మి.. తన మోస్ట్ పాపులర్ నోట్ సిరీస్‌లో Redmi Note 17 లైనప్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా రానున్న Redmi Note 17 Pro స్మార్ట్‌ఫోన్ తాజాగా చైనాకు చెందిన ప్రతిష్టాత్మక 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్ మోడల్ నంబర్, దాని ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి. పాత మోడల్ అయిన రెడ్‌మి నోట్ 15 ప్రో కంటే ఇది చాలా అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.
సర్టిఫికేషన్ సైట్లో దొరికిపోయిన రెడ్‌మి కొత్త ఫోన్
షావోమి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించని ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ 2607DRA18C అనే మోడల్ నంబర్‌తో చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కనిపించింది. గతంలో వచ్చిన లీకుల ఆధారంగా.. ఈ మోడల్ నంబర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న Redmi Note 17 Proకి సంబంధించినదిగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఛార్జింగ్ స్పీడ్‌లో సూపర్ అప్‌గ్రేడ్
లిస్టింగ్ సమాచారం ప్రకారం.. రెడ్‌మి నోట్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ MDY-15-EQ మోడల్ నంబర్ గల 67W ఫాస్ట్ ఛార్జర్‌తో రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే, పాత మోడల్ అయిన రెడ్‌మి నోట్ 15 ప్రో (ఇది 45W ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది) కంటే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పాలి. అయితే ఈ వెబ్‌సైట్లో బ్యాటరీ కెపాసిటీకి సంబంధించిన ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. కానీ, మునుపటి కొన్ని లీకుల ప్రకారం ఈ ఫోన్ లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
లాంచ్ ఎప్పుడు.. స్క్రీన్ ఎలా ఉండబోతోంది?
ఈ కొత్త సిరీస్ లాంచ్ టైమింగ్స్ చూస్తే.. చైనాలో జూలై నెలలోనే రెడ్‌మి నోట్ 17 ప్రో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన రెడ్‌మి నోట్ 17 వేరియంట్లు ఆగస్టులో మార్కెట్లోకి రావచ్చు. ఫీచర్ల పరంగా చూస్తే, ఈ ప్రో మోడల్‌లో 1.5K రిజల్యూషన్ సపోర్ట్ చేసే అద్భుతమైన OLED డిస్‌ప్లే ప్యానెల్‌ను ఇవ్వబోతున్నారట. ఇది ఇటు గేమింగ్‌కు, అటు ఓటీటీ కంటెంట్ చూడటానికి చాలా బాగుంటుంది.
Vivo X Fold 6 : వివో నుంచి నెక్స్ట్ లెవెల్ ఫోల్డబుల్ ఫోన్.. మార్కెట్లోకి వచ్చేసిన Vivo X Fold 6
ప్రాసెసర్, కెమెరా వివరాలు
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను అందించబోతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
పాత మోడల్ ట్రాక్ రికార్డ్
షావోమి గతేడాది ఆగస్టులో చైనాలో రెడ్‌మి నోట్ 15 ప్రోను లాంచ్ చేసి, ఈ ఏడాది జనవరిలో రూ.29,999 ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి తెచ్చింది. ఆ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400-ఆల్ట్రా ప్రాసెసర్, 200 ఎంపీ మెయిన్ కెమెరా, 6,580mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే నోట్ 17 ప్రో మోడల్ ఛార్జింగ్ స్పీడ్, ప్రాసెసర్ పరంగా మునుపటి కంటే చాలా బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని స్పష్టమవుతోంది. చైనా లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
ప్రకటన
ప్రకటన
Vivo X Fold 6 Launched With 7,000mAh Battery, 8.02-Inch Samsung M14 Foldable Display: Price, Specifications