Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x : రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?

శాంసంగ్ గెలాక్సీ A36 5G (8GB RAM + 128GB) వేరియంట్ ప్రారంభ ధర రూ. 28,999 గా ఉంది.

Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x :  రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?

Photo Credit: Samsung/Xiaomi/Vivo

Samsung Galaxy A36 5G vs Redmi Note 17 5G vs Vivo T5x 5G

ముఖ్యాంశాలు
  • ఊహకందని ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న శామ్‌సంగ్, రెడ్ మీ, వీవో
  • Samsung Galaxy A36 5G లో 6.7-ఇంచుల FHD+ Super AMOLED డిస్‌ప్లే
  • వీవోలో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ డెప్త్ కెమెరా
ప్రకటన

Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x :  ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A36 5G, రెడ్ మీ నోట్ 17 5G, వీవొ T5x 5G మోడళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు వేర్వేరు ప్రాసెసర్లు, విభిన్న డిజైన్లు, ఆకట్టుకునే బ్యాటరీ కెపాసిటీలతో వచ్చాయి. శామ్‌సంగ్ తన సొంత ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌ను ఉపయోగించగా, రెడ్‌మీ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో, వీవో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఈ మూడింట్లో దేనికి ఏ రంగంలో ప్రాధాన్యత ఉందో వివరంగా తెలుసుకుందాం.

ధర, వేరియంట్ల వివరాలు:
ధరల విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ A36 5G (8GB RAM + 128GB) వేరియంట్ ప్రారంభ ధర రూ. 28,999 గా ఉంది. ఇక రెడ్ మీ నోట్ 17 5G రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని 6GB+128GB వేరియంట్ ధర రూ. 27,999 కాగా, 8GB+256GB వేరియంట్ ధర రూ. 30,999 గా నిర్ణయించారు. వీవో విషయానికి వస్తే.. వీవో T5x 5G మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని 6GB+128GB వేరియంట్ రూ. 24,999, 8GB+128GB వేరియంట్ రూ. 27,999, 8GB+256GB వేరియంట్ రూ. 30,999 వద్ద లభిస్తున్నాయి. బడ్జెట్ పరంగా చూస్తే వీవో తక్కువ ప్రారంభ ధరతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్:
శాంసంగ్ గెలాక్సీ A36 5Gలో 6.7-ఇంచుల FHD+ Super AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్ మీ నోట్ 17 5G లో 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.9-ఇంచుల భారీ Full HD+ AMOLED డిస్‌ప్లేను అందించారు. అయితే వీవో T5x 5G లో 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.76-ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లే మాత్రమే కలదు. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా శామ్‌సంగ్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పై పనిచేస్తుండగా, రెడ్‌మీ (HyperOS 3), వీవో (OriginOS 6) రెండు ఫోన్లు నూతన ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో రావడం విశేషం.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 5 వేల బడ్జెట్‌లో 5 అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు

కెమెరా విభాగాలు, సెల్ఫీ కెపాసిటీ
కెమెరా విషయానికి వస్తే  శామ్‌సంగ్ వెనుకవైపు 50MP ప్రైమరీ (OIS), 8MP ఆల్ట్రా-వైడ్, 5MP మ్యాక్రో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. రెడ్‌మీలో 50MP ప్రైమరీ కెమెరా మాత్రమే ఉండగా, వీవోలో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ డెప్త్ కెమెరా ఉన్నాయి. అయితే సెల్ఫీల పరంగా చూస్తే Vivo T5x 5G ఏకంగా 32MP ఫ్రంట్ కెమెరాతో ముందంజలో ఉంది. శామ్‌సంగ్‌లో 12MP ఫ్రంట్ కెమెరా, రెడ్‌మీలో 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ 
బ్యాటరీ విభాగంలో రెడ్‌మీ, వీవోలు శామ్‌సంగ్‌ను స్పష్టంగా వెనక్కి నెట్టేశాయి.రెడ్ మీ నోట్ 17 5G లో ఏకంగా 8000mAh అత్యంత భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. వీవో T5x 5G లో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 7200mAh బ్యాటరీ లభిస్తుంది. అదే సమయంలో శాంసంగ్ గెలాక్సీ A36 5Gలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సాధారణ 5000mAh బ్యాటరీ మాత్రమే కలదు. కనెక్టివిటీ కోసం మూడింట్లోనూ 5G, టైప్-సి పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ సదుపాయాలు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »