భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ధరల పెరుగుదలలో శాంసంగ్ చేసిన మార్పే అత్యంత పెద్దదని చెప్పవచ్చు.
Photo Credit: Samsung
Samsung Galaxy M47 5G
Samsung : కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే కస్టమర్లకు ప్రముఖ సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ ఒక భారీ షాకింగ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్ ధరలను విపరీతంగా పెంచేసింది. ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమై కనీసం రెండు వారాలు కూడా గడవకముందే ఇంత పెద్ద మొత్తంలో రేట్లు పెంచడం మొబైల్ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మార్కెట్లో మెమొరీ చిప్స్ కొరత వేధించడం, ర్యామ్ తయారీ వ్యయం రోజురోజుకూ భారమవ్వడం వల్లే స్మార్ట్‌ఫోన్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒప్పో, వివోలను దాటేసిన శాంసంగ్
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ధరల పెరుగుదలలో శాంసంగ్ చేసిన మార్పే అత్యంత పెద్దదని చెప్పవచ్చు. ఇటీవల ఒప్పో, వివో, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా తమ ఫోన్ల ధరలను పెంచినప్పటికీ, అవి కేవలం రూ.1,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ శాంసంగ్ కంపెనీ వీటన్నింటినీ దాటేసి ఏకంగా రూ.7,000 నుంచి రూ.8,000 వరకు ధరలను ఒక్కసారిగా పెంచేసింది. పెరిగిన కొత్త ధరలు కొత్త ఫోన్ కొనాలనుకునే సాధారణ వినియోగదారులను మరోసారి ఆలోచనలో పడేస్తున్నాయి.
వేరియంట్ల వారీగా మారిన రేట్లు
శాంసంగ్ గెలాక్సీ M47 5G మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెరిగిన ధరల వివరాలను పరిశీలిస్తే:
* 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ (బేస్ వేరియంట్): ఈ మోడల్ లాంచ్ ధర రూ. 25,999 కాగా (ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్లతో రూ.22,999 కే లభించింది), ఇప్పుడు దీని ధర ఏకంగా రూ. 7,000 పెరిగి రూ. 32,999 కి చేరుకుంది.
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్: లాంచ్ సమయంలో దీని ధర రూ.28,999 గా ఉండగా, ఇప్పుడు ఇది రూ.36,999 కి పెరిగింది.
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ (టాప్ వేరియంట్): ఈ హై-ఎండ్ మోడల్ లాంచ్ ధర రూ.33,999 కాగా, ప్రస్తుత ధరల పెరుగుదల తర్వాత ఏకంగా రూ.8,000 భారమై రూ. 41,999 వద్ద మార్కెట్లో లిస్ట్ చేయబడింది.
Messenger : మెసెంజర్‌లో మీ పర్సనల్ చాటింగ్ ఎవరికీ తెలియకూడదా? ఈ అదిరిపోయే ట్రిక్ ట్రై చేయండి
6000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రొసెసర్
ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M47 5G లో 6.7 ఇంచుల sAMOLED ప్రీమియం డిస్‌ప్లేను అందించారు. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్, ఎండలో కూడా క్లారిటీ కోసం 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ కోసం 4nm ఆర్కిటెక్చర్‌పై పనిచేసే పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 5G చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు మెరుగైన గ్రాఫిక్స్ కోసం అడ్రినో 710 జీపీయూ (GPU) కూడా ఉంది.
50 ఎంపీ ట్రిపుల్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం శాంసంగ్ గెలాక్సీ M47 5G వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, క్లోజప్ షాట్స్ కోసం 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, వైడ్ షాట్స్ కోసం 5 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ హెచ్‌డీఆర్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, ఇందులో ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలిచేలా 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 45 వోల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999