అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో షావోమి 17T 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ అసలు ధర రూ.59,999గా లిస్ట్ చేయబడింది.
Photo Credit: Xiaomi
Xiaomi 17T
Xiaomi 17T : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, గత నెలలో భారతీయ మార్కెట్లోకి గ్రాండ్‌గా విడుదల చేసిన తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షావోమి 17T పై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుండటంతో మొబైల్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అద్భుతమైన సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కస్టమర్లకు లభించింది. డైమెన్సిటీ పవర్‌ఫుల్ ప్రొసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌పై లభిస్తున్న బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ వివరాలు తెలుసుకుందాం.
ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో షావోమి 17T 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ అసలు ధర రూ.59,999గా లిస్ట్ చేయబడింది. అయితే, కస్టమర్ల కోసం అమెజాన్ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు నేరుగా రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.54,999కి తగ్గుతుంది. దీనికి తోడు మీ పాత పని చేసే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.38,300 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, అది ఎంత మంచి కండిషన్‌లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
URBN Power Bank : ఆపిల్ లవర్స్ కోసం సూపర్ గ్యాడ్జెట్.. మార్కెట్లోకి URBN 5-ఇన్-1 మోస్ట్ పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్
సినిమాటిక్ డిస్‌ప్లే, సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్
షావోమి 17T స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6.59 ఇంచుల 1.5K ఓఎల్ఈడీ ప్రీమియం డిస్‌ప్లేను అమర్చారు. ఇది 2756x1268 పిక్సెల్స్ రెజల్యూషన్, స్మూత్ గేమింగ్,స్క్రోలింగ్ కోసం 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇందులో సరికొత్త ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా పవర్‌ఫుల్ ప్రొసెసర్‌ను వాడారు. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3తో స్మూత్‌గా పనిచేస్తుంది.
కెమెరా లవర్స్ కోసం బెస్ట్ ఛాయిస్
ఫోటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.7 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనితో పాటు దూరం ఉన్న వస్తువులను స్పష్టంగా క్లిక్ చేయడానికి f/3.0 అపెర్చర్, OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, వైడ్ యాంగిల్ షాట్స్ కోసం 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో ఏకంగా 6500mAh మెగా బ్యాటరీని ఇచ్చారు. ఇది 67W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేలా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, వై-ఫై 6, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications