Samsung Galaxy S21 FE స్మార్ట్‌ఫోన్ గత వారం సర్కిల్ టు సెర్చ్ ఫీచర్‌తో కొత్త అప్‌డేట్‌ను అందించిన విషయం తెలిసిందే. కొత్త నివేదిక ప్రకారం.
Photo Credit: Samsung
Samsung Galaxy S21 FE స్మార్ట్‌ఫోన్ గత వారం సర్కిల్ టు సెర్చ్ ఫీచర్‌తో కొత్త అప్‌డేట్‌ను అందించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ఏకకాలంలో అనేక దేశాల్లో ఒకేసారి విడుదల కానున్నట్లు తెలిసింది. గత వారం విజువల్ లుక్అప్ ఫీచర్ అప్‌డేట్ కేవలం ఆసియా దేశాలలో మాత్రమే అని కంపెనీ ప్రకటించింది. తాజాగా అప్‌డేట్‌ను US, కెనడాతోపాటు అనేక దేశాలలో రిలీజ్ చేయనున్నట్లు ఈ సంస్థ దృవీకరించింది. Samsung గెలాక్సీ A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో అనేక అప్‌డేట్‌లను రూపొందించింది. మరెందుకు ఆలస్యం.. ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!
SamMobile నివేదిక ఆధారంగా.. ఈ వారం Samsung Galaxy S21 FE కోసం ఆగస్ట్ 2024 సెక్యూరిటీ అప్‌డేట్ మరిన్ని దేశాల్లో విడుదల చేయబడింది. వీటిలో ఐరోపా, కెనడా, USతోపాటు పలు బహుళ దేశాలు ఉన్నాయి. ఈ అప్‌డేట్ ప్రతి ప్రాంతానికి వేర్వేరు ఫర్మ్‌వేర్ వెర్షన్‌ల ద్వారా ట్రాక్ చేయబడింది. తద్వారా అన్ని ప్రాంతాలకూ అప్‌డేట్‌ను విస్తరించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, అప్‌డేట్ ఫర్మ్‌వేర్ వెర్షన్ G990WVLUCGXG8తో కెనడాలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడయింది. అదేవిధంగా, యూరోపియన్ దేశాలలో అప్‌డేట్ G990BXXU9GXH2 లేదా G990B2XXU8GXH2 ఫర్మ్‌వేర్ వెర్షన్‌లతో రూపొందించబడింది. రెండు వెర్షన్‌ల ప్రాంతంలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లను సూచిస్తాయి. అంటే ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వెర్షన్‌లు అప్‌డేట్ అయ్యేందుకు అనుమతి ఉంటుందన్న మాట.
అదనంగా, ఈ అప్‌డేట్ USలో కూడా విడుదల చేయబడుతుందని నివేదిక పేర్కొంది. అలాగే, Galaxy S21 FE యొక్క క్యారియర్-లాక్, ఫ్యాక్టరీ-అన్‌లాక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. AT&T, Comcast, Dish, Metro, PCS, T-Mobile, Xfinity మొబైల్ నెట్‌వర్క్‌లలోనూ ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ యొక్క క్యారియర్-లాక్ చేయబడిన ఫర్మ్‌వేర్ వెర్షన్ G990USQUCGXG8ని కలిగి ఉన్న అప్‌డేట్ పొందుతున్నట్లు తెలిపింది. అయితే ఫ్యాక్టరీ-అన్‌లాక్ చేయబడిన G990U1UEUCGXG7 ఫర్మ్‌వేర్ వెర్షన్ అన్ని క్యారియర్‌లలో అప్‌డేట్ పొందుతుంది. ఈ కారణంగా వినియోగదారులు కొత్త అప్‌డేట్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
Samsung Galaxy S21 FE వినియోగదారులు ఈ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు నావిగేట్ చేయవచ్చు. అక్కడ, వారు స్క్రీన్ దిగువన ఉన్న డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ అప్‌డేట్ సాఫ్ట్‌వేర్ యొక్క మునుపటి వెర్షన్ నుండి భద్రతా లోపాలను కూడా పరిష్కరిస్తుంది. విడిగా, పిక్సెల్ 9 సిరీస్ కోసం సర్కిల్ టు సెర్చ్‌తో కొత్త పిక్సెల్ స్క్రీన్‌షాట్‌ల యాప్‌ను ఇంటిగ్రేట్ చేయడానికి Google పని చేస్తోందని ఒక నివేదిక పేర్కొంది. ఈ పిక్సెల్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ వినియోగదారులను నేరుగా విజువల్ లుక్అప్ ఫీచర్‌ని ఉపయోగించి స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేయడంతోపాటు AI ప్రాసెసింగ్‌తో ఇమేజ్‌లను సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. నిజానికి, Samsung యూజర్ల గోప్యత, సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మనకు తెలుసు. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లకు, ట్యాబ్‌లకు న్యూ ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే నాక్స్ (Knox), శామ్‌సంగ్ పాస్, సెక్యూర్ ఫోల్డర్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను యూజర్ల కోసం ఇప్పటికే ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఈ సరికొత్త అప్‌డేట్ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి మీరూ Samsung యూజర్స్ అయితే మీరేమంటారు?!
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Googlebook Laptops to Open for Pre-Orders on September 21, Google Confirms