Motorola : మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లేటుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి?

మిగిలిన బ్రాండ్లు ఎప్పుడో ఈ రేసులో దూసుకుపోతుంటే, మోటోరోలా ఇంత లేటుగా రావడానికి గల కారణాలను ఆ కంపెనీ ఏషియా పసిఫిక్ (APAC) మార్కెటింగ్ హెడ్ శివమ్ రంజన్ ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు.

Motorola : మోటోరోలా మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లేటుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి?
ముఖ్యాంశాలు
  • ఫోల్డబుల్ మార్కెట్ హిస్టరీలోనే మోటోరోలా మైండ్ బ్లోయింగ్ స్కెచ్
  • శాంసంగ్ సీటుకు ఎసరు పెడుతూ 'రేజర్ ఫోల్డ్' లాంచ్
  • కంపెనీ ఏపీఏసీ హెడ్ కీలక వ్యాఖ్యలు
ప్రకటన

Motorola : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్లు బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అయితే, ఫ్లిప్ ఫోన్ల తయారీలో రారాజుగా ఉన్న మోటోరోలా.. అందరికంటే ఆలస్యంగా తన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫోల్డ్‎ను 2026లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. మిగిలిన బ్రాండ్లు ఎప్పుడో ఈ రేసులో దూసుకుపోతుంటే, మోటోరోలా ఇంత లేటుగా రావడానికి గల కారణాలను ఆ కంపెనీ ఏషియా పసిఫిక్ (APAC) మార్కెటింగ్ హెడ్ శివమ్ రంజన్ ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు.  

లేటుగా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు స్కెచ్ ఏంటి?
మిగిలిన కంపెనీలు ఇప్పటికే చాలా మోడల్స్ తెచ్చినా మోటోరోలా ఎందుకు వెనుకబడిందనే విమర్శలపై శివమ్ రంజన్ స్పందించారు. 2019లో తాము మొదటిసారి ఫోల్డబుల్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపాక్ట్ లేదా ఫ్లిప్ డిజైన్లకే ఎక్కువ డిమాండ్ ఉండేదని ఆయన చెప్పారు. కానీ కాలక్రమేణా కస్టమర్ల ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయింది. గతంలో 'నాకు అస్సలు ఫోల్డబుల్ ఫోన్ అవసరమా?' అని అడిగిన జనాలు.. ఇప్పుడు  నేను ఏ ఫోల్డబుల్ ఫోన్ కొనాలి? అని అడుగుతున్నారు. మార్కెట్ ఇలా మెచ్యూర్ అయిన తరుణంలో, వినియోగదారులకు ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవడానికి 2026 అనేది పర్ఫెక్ట్ టైమ్ అని మోటోరోలా భావించి ఈ ఫోన్‌ను తెచ్చింది.

ఫ్లిప్ ఫోన్ల పేరును బుక్-స్టైల్ ఫోన్‌కు పెట్టడానికి కారణం?
సాధారణంగా మోటోరోలాలో రేజర్ అనే బ్రాండ్ పేరు కేవలం స్టైలిష్ గా ఉండే ఫ్లిప్ ఫోన్లకు మాత్రమే వాడుతుంటారు. మరి ఈ బుక్-స్టైల్ ఫోన్‌కు  రేజర్ ఫోల్డ్ అని ఎందుకు పేరు పెట్టారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రేజర్ సిరీస్ అంటేనే అత్యంత సన్నని డిజైన్‌కు కేరాఫ్ అడ్రస్. ఈ సరికొత్త రేజర్ ఫోల్డ్ కూడా ఓపెన్ చేసినప్పుడు కేవలం 4.6mm మందంతో మార్కెట్లోనే వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. అందుకే దీనిని రేజర్ ఫ్రాంచైజీ లోకి చేర్చి, ఈ సిరీస్‌ను మరింత విస్తరించినట్లు ఆయన తెలిపారు. 

shivam ranjan Motorola Razr Fold

ఫ్లావలెస్ డిజైన్ సీక్రెట్ 
ఈ ఫోన్ కోసం మోటోరోలా అన్‌ఫోల్డ్ ఫ్లావలెస్ అనే ట్యాగ్‌లైన్ వాడుతోంది. మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి తప్పులు లేకుండా కస్టమర్లకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేదే కంపెనీ లక్ష్యం. ఇందులో మార్కెట్లోనే అత్యంత పెద్దదైన 8.1-ఇంచుల ఇన్నర్ డిస్‌ప్లేను అమర్చారు. దీని హెంజ్ డిజైన్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్, ఫ్రేమ్ కోసం అల్యూమినియం ఉపయోగించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, స్క్రీన్‌కు ఎక్కువ కాలం పాటు ఎలాంటి మడతలు లేదా డ్యామేజీలు జరగకుండా ఉండటం కోసం డిస్‌ప్లే కింద ఒక ప్రత్యేకమైన  టైటానియం ప్లేట్‎ను అమర్చినట్లు రంజన్ వివరించారు.

కెమెరా ఎంపిక వెనుక ఉన్న వ్యూహం 
మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను ఎందుకు వాడారనే దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. కస్టమర్లకు కావాల్సిన అన్ని ఫ్లాగ్‌షిప్ పనులను స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 అత్యంత సమర్థవంతంగా చేయగలదని, అందుకే ఈ టాక్టికల్ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు, ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన తమ సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే చిప్‌సెట్, కెమెరా సెన్సార్లను వాడామని, ఆ ఫోన్ డీఎక్స్ఓ మార్క్ రేటింగ్‌లో ప్రపంచంలోనే టాప్ 10 లో నిలిచిందని గుర్తుచేశారు. అదే టెక్నాలజీని ఇక్కడ వాడటం వల్ల ఇది ప్రపంచంలోనే  బెస్ట్ ఫోల్డబుల్ కెమెరా ఫోన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

motorola razr fold 1 Motorola

కస్టమర్ల కన్నీళ్లు తుడవడానికే ఈ ఆలస్య ఎంట్రీ 
మిగిలిన బ్రాండ్లతో పోటీ పడటం కంటే కస్టమర్ల సమస్యలు తీర్చడానికే మోటోరోలా ప్రాధాన్యత ఇస్తుందని శివమ్ రంజన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లు వాడుతున్న వారు ప్రధానంగా కెమెరా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోవడం, మన్నిక లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకోసమే చాలా మంది ఫోల్డబుల్ ఫోన్ తో పాటు ఇంకో నార్మల్ ఫోన్‌ను కూడా జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ మూడు ప్రధాన సమస్యలను రేజర్ ఫోల్డ్ ఫోన్‌తో తాము పూర్తిగా పరిష్కరించామని ఆయన చెప్పారు.  

ప్రీమియం మార్కెట్లో మోటోరోలా సరికొత్త రికార్డులు 
ఈ రేజర్ ఫోల్డ్ లాంచ్‌తో మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరింత బలంగా దూసుకుపోతోంది. గ్లోబల్ మార్కెట్లో మోటోరోలా  ఎడ్జ్, రేజర్ సిరీస్ లీనప్‌ల ద్వారా వచ్చే రెవెన్యూ 30 శాతానికి పెరిగితే.. మన ఏషియా పసిఫిక్  ప్రాంతంలో అది ఏకంగా 50 శాతానికి పైగా దాటేసిందని శివమ్ రంజన్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోలో నార్మల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో పాటు, ఫ్లిప్ ఫోన్, బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ అన్నీ అందుబాటులోకి రావడంతో ప్రీమియం కస్టమర్లకు అన్ని ఆప్షన్లు ఇచ్చినట్లు అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. లేటుగా వచ్చినా.. మార్కెట్ పూర్తిగా మెచ్యూర్ అయినప్పుడు పక్కా ప్లానింగ్‌తో రావడం మోటోరోలాకు ప్లస్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »