రియల్‌మీ, ఇన్‌ఫినిక్స్, టెక్నో, రెడ్‌మి వంటి కంపెనీలు తమ బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లను రంగంలోకి దించుతున్నాయి.
Photo Credit: Infinix
Infinix Smart 20 में 120Hz रिफ्रेश रेट वाला 6.78 इंच का बड़ा डिस्प्ले दिया गया है।
New Smartphones : మొబైల్ లవర్స్‌కు జూన్ నెల రెండో వారం ఒక పెద్ద పండగలా మారబోతోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రాబోయే కొద్ది రోజుల్లో సరికొత్త మొబైల్స్ సందడి చేయనున్నాయి. జూన్ 8 నుంచి జూన్ 15, 2026 మధ్య కాలంలో దేశీయ మార్కెట్లోకి పలు పాపులర్ బ్రాండ్ల ఫోన్లు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్‌మీ, ఇన్‌ఫినిక్స్, టెక్నో, రెడ్‌మి వంటి కంపెనీలు తమ బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లను రంగంలోకి దించుతున్నాయి. తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్న ఆ ఫోన్ల వివరాలు చూద్దాం.
రూ.12 వేల బడ్జెట్‌లో ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20
ఈ వరుసలో మొదటగా వస్తున్న ఫోన్ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20. జూన్ 8న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో ఈ ఫోన్ అధికారికంగా విడుదలైంది. దీని ప్రారంభ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, ఇన్‌ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 స్పెసిఫికేషన్లు
ఈ బడ్జెట్ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచుల పెద్ద డిస్‌ప్లేను అందించారు. కేవలం 7.7 మిమీ మందంతో ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హెలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు 4GB ర్యామ్, 2TB వరకు పెంచుకునే స్టోరేజ్ సపోర్ట్ ఉంది. దీనిలోని 5,200mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 39 రోజుల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఉన్న అల్ట్రా లింక్ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేకపోయినా 1 కిలోమీటర్ పరిధిలోని ఇన్‌ఫినిక్స్ ఫోన్ల మధ్య వైర్‌లెస్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఇచ్చారు.
భారీ బ్యాటరీతో రియల్‌మీ P4R 5G
రియల్‌మీ బ్రాండ్ నుండి వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫోన్ రియల్‌మీ P4R 5G జూన్ 10న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్ లావెండర్ గ్లేర్, సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ ఏంటంటే, ఇందులో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది వరుసగా మూడు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ బల్లగుద్ది చెప్తోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
రియల్‌మీ P4R 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. కెమెరా విభాగంలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ఏఐ (AI) ప్రధాన కెమెరాతో పాటు ఒక సెకండరీ సెన్సార్ ఉంటుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 పై పనిచేస్తుంది. అంతేకాకుండా, ఆర్మీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్, IP65 రేటింగ్‌తో వస్తున్నందున ఈ ఫోన్ చాలా ధృడంగా ఉంటుంది.
Moolyam OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన పవర్‌ఫుల్ సోషల్ డ్రామా మూల్యం.. ఎక్కడ చూడాలంటే?
మార్కెట్లోకి టెక్నో పోవా 8
టెక్నో కంపెనీ తన పవర్‌ఫుల్ టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోంది. ఈ మేరకు కంపెనీ ఒక అఫీషియల్ టీజర్‌ను కూడా వదిలింది. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో రానుంది. దీనికి 6GB ర్యామ్ తోడుగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5G కనెక్టివిటీతో పాటు బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, వై-ఫై వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి.
అత్యంత వేగవంతమైన రెడ్‌మి టర్బో 5
ఈ వారంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఫోన్ రెడ్‌మి టర్బో 5. ఈ పవర్‌ఫుల్ మొబైల్ జూన్ 16న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను వాడారు. దీనికి తోడు ఏకంగా 24GB వరకు ర్యామ్ సపోర్ట్ (12GB ఫిజికల్ ర్యామ్ + 12GB వర్చువల్ ర్యామ్) లభిస్తుంది. రెడ్‌మి హిస్టరీలోనే ఇది అత్యంత వేగవంతమైన, పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ కాబోతుందని కంపెనీ చెబుతోంది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫోన్ కొనాలనుకునే వారికి ఈ వారం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals