VIVO S30 సిరీస్ తో పాటు లాంచ్ అవుతున్న VIVO పాడ్ 5 టాబ్లెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు VIVO ప్రకటించింది. ఈ మోడల్ కూడా మే 29న చైనాలో లాంచ్ చేయనుంది.
Photo Credit: Vivo
వివో ఎస్ 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఒక్కొక్కటి 6,500 ఎంఏహెచ్ బ్యాటరీలను ప్యాక్ చేస్తాయి
చైనా మొబైల్ బ్రాండ్ కంపెనీ VIVO మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్ బ్రాండ్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్లో మంచి మొబైల్ ఫోన్స్ కావాలంటే VIVO మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తాజాగా VIVO తన కొత్త S30 సిరీస్ లో వచ్చే మొబైల్ లాంచింగ్ డేట్ ను ప్రకటించింది. ఇందులో VIVO S30, S30ప్రో మినీ ఉన్నాయి. వీటితో పాటుగా VIVO పాడ్ 5 టాబ్లెట్, TWS ఎయిర్ 3 ఇయర్ ఫోన్స్, ఇన్బిల్ట్ వైర్ 33W పవర్ బ్యాంక్ కూడా లాంచ్ అవ్వనున్నాయి. ఈ మోడల్స్ లాంచింగ్ డేట్ తో పాటు, కీ ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ కూడా ప్రకటించింది.లాంచింగ్ ఎప్పుడంటే,VIVO తన కొత్త S30 సిరీస్ లో వస్తున్న VIVO S30, VIVO S30ప్రో మినీ మోడల్స్ చైనాలో ఈనెల 29న లాంచ్ అవుతున్నాయి. అక్కడి లోకల్ టైమింగ్స్ ప్రకారం సాయంత్రం 7 గంటలకి ఇవి లాంచ్ అవుతాయని కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది. VIVO అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అలాగే ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా ఈ మోడల్స్ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపింది.
VIVO S30 బేస్ మోడల్ కోకో బ్లాక్, లెమన్ ఎల్లో, మింట్ గ్రీన్, పీచ్ పౌడర్ కలర్స్ లో అవైలబుల్ గా ఉండనుందని కంపెనీ ప్రకటించింది. 50 మెగా పిక్సెల్ సోనీ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్సెట్ ప్రాసెసర్ ,6.67 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తోంది.
అలాగే VIVO S30 ప్రో మినీ కూడా వెనిలా వేరియంట్ లాగా కోకో బ్లాక్, లెమన్ ఎల్లో, మింట్ గ్రీన్ కలర్స్ తో వస్తోంది. వీటికి అదనంగా కూల్బెర్రీ పౌడర్ కలర్ కూడా ఉండనుంది. ఈ మోడల్ 6.31 ఇంచ్ కాంపాక్ట్ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తోంది.
ఈ రెండు మోడల్స్ లోనూ 6500mAH బ్యాటరీ, ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం మెటల్ మిడిల్ ఫ్రేమ్స్ ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
ఈ మొబైల్స్ తో పాటు VIVO ప్యాడ్ 5 టాబ్లెట్ కూడా అదేరోజు లాంచ్ చేయనుంది. ఈ టాబ్లెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ చిప్ సెట్ తో వస్తోంది. వీటికి అదనంగా VIVO TWS ఎయిర్ 3 ఇయర్ ఫోన్స్ , ఇన్బిల్ట్ వైర్ తో 33W పవర్ బ్యాంక్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ లో ఉండే ఒక్కో బడ్ 3.6 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే 45 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లైమ్ చేసింది.
ఇక ఈ VIVO S30 ప్రో మినీ మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ లేదా మీడియా టెక్ డైమెన్సిటీ 9400e SoC ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే 100W వైర్లెస్ మరియు వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఇన్ని మోడల్స్ ఒకేసారి లాంచ్ అవడంతో VIVO ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మోడల్స్ కనుక క్లిక్ అయితే మార్కెట్లో మరోసారి VIVO తన రేంజ్ పెంచుకోవడం గ్యారెంటీ.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999