Vivo V70 FE 5G : రూ.19 వేల భారీ డిస్కౌంట్.. 200MP కెమెరాతో Vivo V70 FE 5G ఇప్పుడు సూపర్ డీల్

వివో V70 FE 5G స్మార్ట్‌ఫోన్ అసలు ఎమ్ఆర్‌పి ధర రూ.53,999 కాగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్‎లో దీనిని ఏకంగా 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.38,999 లకే లిస్ట్ చేశారు.

Vivo V70 FE 5G : రూ.19 వేల భారీ డిస్కౌంట్.. 200MP కెమెరాతో Vivo V70 FE 5G ఇప్పుడు సూపర్ డీల్

Photo Credit: Vivo

Vivo V70 FE 5G

ముఖ్యాంశాలు
  • వివో V70 FE 5G పై పండగ లాంటి ఆఫర్
  • 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
  • విజయ్ సేల్స్‌లో రూ.19,000 వరకు తగ్గింపు
ప్రకటన

Vivo V70 FE 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో గతేడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించిన వివో V70 FE 5G ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి భారీ ఆదరణ పొందుతోంది. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో ట్రెండ్ సృష్టించిన ఈ మోడల్‌ను ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే కొనుగోలుదారులకు ఈ ఆఫర్ ఒక పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు.

విజయ్ సేల్స్‌లో రూ.19,000 వరకు తగ్గింపు
వివో V70 FE 5G స్మార్ట్‌ఫోన్ అసలు ఎమ్ఆర్‌పి  ధర రూ.53,999 కాగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్‎లో దీనిని ఏకంగా 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.38,999 లకే లిస్ట్ చేశారు. దీనితో పాటు వినియోగదారులకు మరింత లబ్ధి చేకూర్చేలా బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇఎమ్‌ఐ లావాదేవీల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే తక్షణమే రూ.4,000 అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ప్రారంభ ధర మరింత అందుబాటులోకి వస్తుంది.

అద్భుతమైన డిస్ప్లే, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్
వివో V70 FE 5G ఫోన్ 6.83 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సులువుగా సాగేందుకు ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్‌ను అమర్చారు. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై పనిచేస్తుంది.

iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్

200 మెగాపిక్సెల్ కెమెరా,  7000mAh బ్యాటరీ
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో వెనుక వైపు OIS సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర ఏకంగా 50 మెగాపిక్సెల్ ఐ ఆటో-ఫోకస్ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో ఏకంగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్‌ను కూడా అందించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »