వీవో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాకు చెందిన అధికారిక సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ SDPPIలో లిస్ట్ అయ్యింది.
Photo Credit: Vivo
Vivo : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం మరో సరికొత్త ప్రీమియం మొబైల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో పరిచయం చేయడానికి రెడీ అయ్యింది. గతనెలలోనే చైనాలో అత్యంత వైభవంగా లాంచ్ అయిన బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వీవో ఎక్స్ ఫోల్డ్ 6ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వీవో తన సరికొత్త టెక్నాలజీతో శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ మొబైల్ అంతర్జాతీయ లాంచ్‌కు ముందే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన లీక్ వెలుగుచూసింది. ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అన్విన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వీవో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాకు చెందిన అధికారిక సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ SDPPIలో లిస్ట్ అయ్యింది. ఈ సైట్లో ఈ ఫోన్ V2559 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో ఫోన్ స్పెసిఫికేషన్లను పూర్తిగా వెల్లడించనప్పటికీ, ఇది త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి, ఆసియా దేశాలలో లాంచ్ కాబోతోందనే బలమైన సంకేతాలను ఇచ్చింది. దీనికంటే ముందే యూరప్‌కు చెందిన ఈఈసీ సర్టిఫికేషన్ సైట్లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అవ్వడం గమనార్హం.
గ్లోబల్ మార్కెట్లోకి రాబోయే వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఫీచర్లు దాదాపు చైనీస్ వేరియంట్ లాగే ఉండే అవకాశం ఉంది. స్క్రీన్ విషయానికి వస్తే, ఇందులో రెండు అద్భుతమైన డిస్‌ప్లేలను అందించారు. లోపలి భాగంలో 120Hz రీఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 8.02 ఇంచుల (2504 x 2312 పిక్సెల్స్) భారీ ఇన్నర్ ఫోల్డబుల్ అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇక ఫోన్ మడతబెట్టినప్పుడు వాడుకోవడానికి వెలుపల 6.51 ఇంచుల (1120 x 2528 పిక్సెల్స్) అమోలెడ్ కవర్ స్క్రీన్‌ను కేటాయించారు. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు, ఇది భారీ గేమింగ్‌ను కూడా చాలా సులువుగా హ్యాండిల్ చేస్తుంది.
Asus : అసూస్ సరికొత్త సంచలనం.. అదిరిపోయే ఏఐ ఫీచర్లతో వివోబుక్ 14, వివోబుక్ 15 లాంచ్
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం మొబైల్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. దీని వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను ఇచ్చారు. ఈ రేర్ కెమెరా సెటప్ ద్వారా యూజర్లు ఏకంగా 8K క్వాలిటీతో అత్యంత స్పష్టమైన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇటు లోపలి స్క్రీన్ పైన, అటు బయటి కవర్ స్క్రీన్ పైన విడివిడిగా రెండు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను కేటాయించడం విశేషం.
ఇంతటి భారీ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌కు పవర్‌ను అందించడం కోసం వీవో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని ఇందులో అమర్చింది. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీని చూడటం చాలా అరుదు. దీనికి తోడు ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది, దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా వేగంగా ఛార్జ్ అయిపోతుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్‌లోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, బైదూ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఫోన్ పొజిషన్‌ను పక్కాగా గుర్తించడానికి గైరోస్కోప్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్లను కూడా అమర్చారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo Find X10 Pro Max Confirmed to Launch in India as First Phone With a Triple 200-Megapixel Camera System
Redmi K100 Officially Confirmed to Launch Later This Month; Pre-Orders Begin