షావోమి సంస్థ మే 28న ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ షావోమి 17T సిరీస్‌ను విడుదల చేయనుంది.
Photo Credit: Xiaomi
Xiaomi 17T will succeed the Xiaomi 15T (pictured)
Xiaomi 17T : భారతదేశంలోని షావోమి అభిమానులకు ఇదొక సూపర్ గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త సంచలనాలకు వేదికైన T సిరీస్‌ను షావోమి సంస్థ మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. చివరిగా 2022 జనవరి నెలలో షావోమి 11T ప్రో మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసిన కంపెనీ, ఆ తర్వాత ఈ సిరీస్‌ను ఇక్కడ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం.. జూన్ 4వ తేదీన సరికొత్త షావోమి 17T స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ది T ఈజ్ కమింగ్ అంటూ షావోమి చేస్తున్న హడావిడి టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేస్తోంది.
షావోమి సంస్థ మే 28న ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ షావోమి 17T సిరీస్‌ను విడుదల చేయనుంది. గ్లోబల్ మార్కెట్లో షావోమి 17T, షావోమి 17T ప్రో అనే రెండు మోడల్స్ రాబోతున్నప్పటికీ, ఇండియాకు మాత్రం కేవలం స్టాండర్డ్ మోడల్ అయిన షావోమి 17T మాత్రమే పరిమితం కానుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండే ప్రో వెర్షన్‌ను కేవలం అంతర్జాతీయ మార్కెట్లకే పరిమితం చేసి, ఇండియన్ కస్టమర్ల బడ్జెట్‌కు తగినట్లుగా స్టాండర్డ్ మోడల్‌ను జూన్ 4వ తేదీన ఇక్కడ లాంచ్ చేయనున్నారు.
ఇంకా అధికారికంగా లాంచ్ కానప్పటికీ, ఈ ఫోన్ ధరలకు సంబంధించిన లీక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్ ధర 780 డాలర్ల నుంచి 800 డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.74,000 నుంచి రూ.76,000) వరకు ఉండే అవకాశం ఉంది. అయితే భారతీయ కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఇండియాలో దీని ధరను కాస్త తక్కువగానే ఉంచబోతున్నట్లు సమాచారం. అందుతున్న లీక్స్ ప్రకారం భారతదేశంలో షావోమి 17T ధర రూ.69,000 నుంచి రూ.72,000 మధ్యలో ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మార్కెట్లోని వన్‌ప్లస్, శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్ అనే చెప్పాలి. ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో ఉండే ఒక సరికొత్త కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. ఇందులో ప్రపంచ ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ Leica ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ ఉండబోతోంది. లీకైన రిపోర్ట్స్ ప్రకారం, ఇందులో f/1.77 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 ప్రధాన కెమెరాను ఇస్తున్నారు. దీనితో పాటు 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ కెమెరాను ఇవ్వబోతున్నారు.
పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ టాప్ లెవెల్‌లో ఉండబోతోంది. ఇందులో గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందించగల ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రొసెసర్‌ను వాడినట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా సూపర్ ఫాస్ట్ వర్కింగ్ కోసం 12GB LPDDR5x రామ్, భారీ డేటాను దాచుకోవడానికి వీలుగా 512GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని అమర్చినట్లు సమాచారం. ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల హెవీగా వాడినా కూడా ఒకటిన్నర నుంచి రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాకప్ వస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999