Xiaomi : జూన్ 4న Xiaomi 17T లాంచ్.. 6,500mAh బ్యాటరీ, లైకా కెమెరాలతో అరాచకమైన ఫీచర్స్

షావోమి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ జూన్ 4వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానుంది.

Xiaomi : జూన్ 4న Xiaomi 17T లాంచ్.. 6,500mAh బ్యాటరీ, లైకా కెమెరాలతో అరాచకమైన ఫీచర్స్

Photo Credit: Xiaomi

Xaiomi 17T will launch in India with a Leica-tuned 50-megapixel triple rear camera

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి షావోమి పవర్‌ఫుల్ డైనోసార్ ఫోన్
  • 6,500mAh బ్యాటరీ దెబ్బకు మిగతా బ్రాండ్స్ అన్నీ క్లోజ్
  • లీకైపోయిన 'Xiaomi 17T' ఫీచర్స్
ప్రకటన


Xiaomi : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారత మార్కెట్లో మరో పవర్‌ఫుల్ మొబైల్‌ను లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ వారంలోనే  Xiaomi 17T స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సిరీస్.. ఇప్పుడు మన దేశంలో సందడి చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా వంటి కీలకమైన ఫీచర్స్ ఇంటర్నెట్‌లో లీకై టెక్ ప్రియులను ఊపేస్తున్నాయి. అదిరిపోయే లైకా కెమెరా ఫీచర్లు, ఏకంగా 6500 ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో రాబోతున్న ఈ సరికొత్త మొబైల్  వివరాలను తెలుసుకుందాం.

జూన్ 4వ తేదీనే గ్రాండ్ లాంచ్ 
షావోమి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ జూన్ 4వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ తన అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ టీజర్లను ఇప్పటికే రిలీజ్ చేస్తూ అంచనాలను భారీగా పెంచేస్తోంది. లాంచ్ అయిన వెంటనే షావోమి అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. అయితే ఇండియన్ మార్కెట్ కోసం ఈ ఫోన్ ధర ఎంత ఉండబోతుందనే విషయాన్ని కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది.

లైకా బ్రాండింగ్‌తో అద్భుతమైన డిజైన్  
షావోమి రిలీజ్ చేసిన అధికారిక టీజర్ల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్లో కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇందులో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు లగ్జరీ కెమెరా బ్రాండ్ అయిన  లైకా లోగో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గ్లోబల్ వేరియంట్ తరహాలోనే ఇండియాలో కూడా ఈ ఫోన్‌ను బ్లాక్, వైట్, బ్లూ, వయొలెట్ వంటి సూపర్బ్ కలర్ ఆప్షన్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది.

కంటికి రక్షణనిచ్చే అదిరిపోయే డిస్ప్లే 
యూజర్ల కంటి భద్రత కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన ఐ-కేర్ డిస్ప్లేను వాడుతున్నట్లు షావోమి కన్ఫర్మ్ చేసింది. ఇది TÜV Rheinland సర్టిఫికేషన్లతో వస్తోంది. గ్లోబల్ మోడల్ లాగే ఇందులో కూడా 6.59-ఇంచుల అమోలెడ్ డిస్ప్లే ఉండే ఛాన్స్ ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz పిడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లు చెదిరే విజువల్స్ అందిస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లేటెస్ట్ షావోమి హైపర్‌ఓఎస్ 3తో రన్ అవుతుంది.

మీడియాటెక్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్ 
ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా.. మీడియాటెక్ సంస్థకు చెందిన పవర్‌ఫుల్ Dimensity 8500-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. ఇండియాలో ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌లో గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌తో పాటు ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ సెర్చ్ వంటి క్రేజీ హైపర్ ఏఐ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి.
 

xiaomi 17t xiaomi inline xiaomi 17t

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం లైకా కెమెరా మ్యాజిక్  
కెమెరా లవర్స్ కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా లైకా 5x టెలిఫోటో ఫోటోగ్రఫీ సపోర్ట్‌ను ఇస్తున్నారు, దీని ఫోకల్ లెంగ్త్ 23mm నుంచి 115mm వరకు ఉంటుంది. లైకా లైవ్ పోర్ట్రెయిట్, టెలిమాక్రో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్లోబల్ మోడల్ లాగే ఇండియాలో కూడా ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ లైకా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చే అవకాశం ఉంది.

చార్జింగ్ టెన్షన్ లేని 6,500mAh మెగా బ్యాటరీ  
బ్యాటరీ పరంగా ఈ ఫోన్ ఒక సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇండియాలో రాబోయే Xiaomi 17T మోడల్‌లో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని ప్యాక్ చేసినట్లు కంపెనీ ఖరారు చేసింది. దీనికి తోడు 67W హైపర్‌చార్జ్  ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా.. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ సులభంగా వస్తుంది.

కూలింగ్ సిస్టమ్, ఇతర క్రేజీ ఫీచర్స్ 
ఫోన్ ఎక్కువ సేపు వాడినా వేడెక్కకుండా ఉండటం కోసం షావోమి ఇందులో 3D IceLoop కూలింగ్ సిస్టమ్‎ను అమర్చింది. ఇది కాకుండా నీటిలో పడినా పాడవకుండా ఉండేలా ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ గల డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6E, బ్లూటూత్ 6.0, ఐఆర్ బ్లాస్టర్ వంటి అన్ని రకాల ప్రీమియం ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »