Xiaomi 17T Launched in India: శాంసంగ్ కు దెబ్బ మీద దెబ్బ.. భారత మార్కెట్లోకి షావోమి 17T

Xiaomi 17T Launched in India: షావోమి 17T బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.59,999 గా ఉండగా, టాప్ వేరియంట్ (12GB+512GB) ధర రూ.64,999 గా నిర్ణయించారు.

Xiaomi 17T Launched in India: శాంసంగ్ కు దెబ్బ మీద దెబ్బ.. భారత మార్కెట్లోకి షావోమి 17T

Photo Credit: Xiaomi/Samsung/OnePlus

Xiaomi 17T vs Samsung Galaxy A57 5G vs OnePlus 15R

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి షావోమి 17T (Xiaomi 17T) ఎంట్రీ
  • ఏకంగా 7,400mAh పవర్‌తో దూసుకొచ్చిన కొత్త మోడల్
  • 120x డిజిటల్ జూమ్ కెమెరాతో షావోమి సరికొత్త ఫోన్
ప్రకటన

Xiaomi 17T Launched in India: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో పోటీ ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ చైనీస్ బ్రాండ్ షావోమి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ షావోమి 17Tను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న శాంసంగ్ గెలాక్సీ A57 5G, వన్‌ప్లస్ 15R  మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో వచ్చిన ఈ మూడు ఫోన్ల మధ్య ఉన్న అసలైన తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ధరల వివరాలు ఎలా ఉన్నాయంటే..?
మొదటగా ధరల విషయానికి వస్తే.. షావోమి 17T బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.59,999 గా ఉండగా, టాప్ వేరియంట్ (12GB+512GB) ధర రూ.64,999 గా నిర్ణయించారు. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ A57 5G లోని 8GB+256GB మోడల్ ధర రూ.53,999, 12GB+256GB మోడల్ ధర రూ.57,999 గా ఉంది. ఇక వన్‌ప్లస్ 15R విషయానికి వస్తే, దీని 12GB+256GB వేరియంట్ రూ.54,999 కి, 12GB+512GB వేరియంట్ రూ.59,999 ధరల వద్ద లభిస్తున్నాయి. బడ్జెట్ పరంగా చూస్తే శాంసంగ్ కాస్త తక్కువ ధరకు దొరుకుతోంది.

డిస్‌ప్లే, విజువల్ క్వాలిటీ
స్క్రీన్ విషయానికి వస్తే మూడు ఫోన్లు విభిన్నమైన టెక్నాలజీని కలిగి ఉన్నాయి. షావోమి 17T లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ A57 లో 6.7 ఇంచుల FHD+ సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్ ఉంది. అయితే ఈ రేసులో వన్‌ప్లస్ 15R అందరికంటే ముందుంది. ఇందులో 6.83 ఇంచుల 1.5K AMOLED స్క్రీన్‌తో పాటు ఏకంగా 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీనివల్ల గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుంది.

ప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, మూడు కంపెనీలు వేర్వేరు పవర్‌ఫుల్ చిప్‌సెట్‌లను వాడాయి. షావోమి 17T లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా  ప్రాసెసర్‌ను ఉపయోగించారు. శాంసంగ్ తన సొంత ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కాగా వన్‌ప్లస్ 15R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5  చిప్‌సెట్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ మూడు ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగానే పనిచేస్తాయి. కాకపోతే షావోమిలో హైపర్ ఓఎస్ 3, శాంసంగ్‌లో వన్ యూఐ 8.5, వన్‌ప్లస్‌లో ఆక్సిజన్ ఓఎస్ 16 స్క్రీన్‌లు యూజర్ ఇంటర్‌ఫేస్‌గా ఉంటాయి.
 

Moolyam OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన పవర్‌ఫుల్ సోషల్ డ్రామా మూల్యం.. ఎక్కడ చూడాలంటే?

బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్
స్మార్ట్‌ఫోన్లకు ప్రాణమైన బ్యాటరీ విభాగంలో పెద్ద మార్పులే ఉన్నాయి. షావోమి 17T లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 67W హైపర్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ A57 లో ఎప్పటిలాగే స్టాండర్డ్ 5,000mAh బ్యాటరీని మాత్రమే ఇచ్చారు. ఈ విభాగంలో కూడా వన్‌ప్లస్ 15R సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 7,400mAh బ్యాటరీని అమర్చడమే కాకుండా, దానికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు.

కెమెరా సామర్థ్యాలు, ఫోటోగ్రఫీ
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం షావోమి 17T ఒక వరం లాంటిది. దీని వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ ప్రధాన కెమెరా, 120x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A57 లో 50MP మెయిన్ + 5MP మాక్రో + 12MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 15R లో 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మాత్రమే ఉన్నాయి. సెల్ఫీల కోసం షావోమి, వన్‌ప్లస్‌లలో 32MP ఫ్రంట్ కెమెరా ఉండగా, శాంసంగ్‌లో 12MP కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ, ఫోన్ సైజ్ వివరాలు
కనెక్టివిటీ ఫీచర్ల పరంగా మూడు ఫోన్లలోనూ 5G, వై-ఫై, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ,  యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు సర్వసాధారణంగా ఉన్నాయి. బరువు, సైజ్ విషయానికి వస్తే.. శాంసంగ్ కేవలం 179 గ్రాముల బరువు, 6.9 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. షావోమి 17T బరువు 200 గ్రాములు, మందం 8.17 మిమీగా ఉంది. భారీ బ్యాటరీ ఉన్న కారణంగా వన్‌ప్లస్ 15R బరువు 218 గ్రాములు, మందం 8.1 మిమీగా ఉంది. అద్భుతమైన జూమ్ కెమెరా కావాలనుకునే వారు షావోమిని, ఎక్కువ బ్యాటరీ, గేమింగ్ స్పీడ్ కావాలనుకునే వారు వన్‌ప్లస్‌ను ఎంచుకోవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  2. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  3. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  4. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా..శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ 5జీ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్లు
  6. Chandra Grahan: రాఖీ పండగ రోజే ఏడాది ఆఖరి చంద్రగ్రహణం..భారత్‌లో సూతకం ఉంటుందా?
  7. PM Ujjwala Yojana: ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పొందే గొప్ప అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి
  8. Flipkart Freedom Sale : స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‎లో నథింగ్ ఫోన్ 4బి పై భారీ డిస్కౌంట్
  9. Apple: ఆపిల్ లవర్లకు అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్.. అతితక్కువ ఈఎంఐకే ఐఫోన్, మ్యాక్‌బుక్
  10. Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఆఫర్.. రూ.45,000 తక్కువకే 200MP కెమెరా ఫోన్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »