Redmi 17 5G : 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చేసింది.. ధర ఎంతంటే?

బడ్జెట్ ధరలోనే 6300mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌లో తీసుకొచ్చారు.

Redmi 17 5G : 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చేసింది.. ధర ఎంతంటే?

Photo Credit: Redmi

Redmi 17 5G

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి రెడ్‌మీ 17 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల
  • 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చెసింది
  • చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ 17 5G
ప్రకటన

Redmi 17 5G : ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన బడ్జెట్ సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. చైనా మార్కెట్లో రెడ్‌మీ 17 5Gని సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక అఫర్డబుల్ 5G స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ ధరలోనే 6300mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌లో తీసుకొచ్చారు.

ధర, వేరియంట్ల వివరాలు 
రెడ్‌మీ 17 5G ప్రారంభ వేరియంట్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను చైనాలో 999 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ. 14,000) గా నిర్ణయించారు. ఇక 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్ మోడల్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.17,000) గా ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను కోల్డ్ మిస్ట్ బ్లూ, ఫెదర్ మిస్ట్ వైట్, స్టార్ రాక్ బ్లాక్ అనే మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Spam Calls : స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లపై ట్రాయ్ ఉక్కుపాదం.. ఏకంగా 148 కోట్ల కాల్స్ బ్లాక్

డిస్‌ప్లే, స్పెసిఫికేషన్లు 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. వర్షంలో కూడా స్క్రీన్ ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసేందుకు వెట్ టచ్ 2.0 ఫీచర్‌ను, డీసీ డిమ్మింగ్ టెక్నాలజీని ఇందులో అందించారు. పర్ఫామెన్స్ విషయానికొస్తే.. ఇది 6nm ప్రాసెస్‌పై తయారైన Unisoc T8300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ రామ్, యుఎఫ్ఎస్ 2.2  స్టోరేజ్ టైప్‌ను యాడ్ చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16  ఆధారిత హైపర్ఓఎస్ 3 పై నడుస్తుంది.

కెమెరా, భారీ బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు 
ఫొటోగ్రఫీ కోసం రెడ్‌మీ 17 5G లో వెనుక వైపు 13MP ప్రైమరీ రియర్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు,  వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మెయిన్ అట్రాక్షన్ దీనిలోని 6300mAh భారీ బ్యాటరీ. దీనికి 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్,  7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, జీపీఎస్ వంటి ఫీచర్లతో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్ సెన్సార్లు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »