HMD : రూ. 11 వేలకే 5G ఫోన్..6,000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చేసిన HMD వాల్యూమ్ 2

ఇందులో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను కంపెనీ కేవలం రూ.10,999గా నిర్ణయించింది.

HMD : రూ. 11 వేలకే 5G ఫోన్..6,000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చేసిన HMD వాల్యూమ్ 2

Photo Credit: HMD

HMD Vibe 2 5G has a side-mounted fingerprint scanner for authentication

ముఖ్యాంశాలు
  • HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దించారు
  • బేస్ వేరియంట్ ధరను కంపెనీ కేవలం రూ.10,999గా నిర్ణయించింది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ప్రకటన

HMD : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే ప్రముఖ సంస్థ హెచ్ఎండీ భారతీయ వినియోగదారుల కోసం ఒక సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ను గురువారం అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది మార్కెట్లోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న HMD Vibe 5G మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దించారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీ ఆశించే సామాన్యులకు ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

HMD Vibe 2 5G ధర, లభ్యత
భారతదేశంలో HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేర్వేరు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను కంపెనీ కేవలం రూ.10,999గా నిర్ణయించింది. అలాగే అదే 4GB రామ్‌తో పాటు 128GB పెద్ద స్టోరేజ్ ఉన్న టాప్ ఎండ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్‌ను కస్టమర్లు కాస్మిక్ ల్యావెండర్, నార్డిక్ బ్లూ, పీచ్ పింక్ అనే మూడు వైబ్రెంట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది.

బడ్జెట్ ధరలో బిగ్ స్క్రీన్.. 120Hz రిఫ్రెష్ రేట్
ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.7 అంగుళాల పెద్ద హెచ్‌డీ+ డిస్‌ప్లేను అమర్చారు. దీని రిజల్యూషన్ 720×1,600 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 265ppi గా ఉంది. ఈ ధరలో చాలా ఫోన్లు కేవలం 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంటే, HMD మాత్రం ఏకంగా 120Hz హై రిఫ్రెష్ రేట్‌ను అందించడం విశేషం. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఆక్టా-కోర్ ప్రాసెసర్, మెమరీ
ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్‌ను అందించే పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ యునిసోక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు, సోషల్ మీడియా అప్లికేషన్లు, నార్మల్ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేయగలదు. ఈ ఫోన్ రెండు మోడల్స్‌లోనూ 4GB RAM స్టాండర్డ్‌గా వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను మరింత పెంచుకునే సదుపాయం కూడా ఉంది.

50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ప్రత్యేకతలు
ఫోటోగ్రఫీ కోసం HMD Vibe 2 5Gలో వెనుక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సపోర్ట్ ఉన్న సింగిల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, దీనికి తోడుగా ఎల్‌ఈడీ (LED) ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. ఈ కెమెరాతో పగటిపూట మంచి క్వాలిటీ ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను జత చేశారు. బడ్జెట్ ధరలో ఫోటోలు నీట్‌గా వచ్చేలా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ చేశారు.

బాహుబలి బ్యాటరీ, అదనపు ఫీచర్లు
ఈ ఫోన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీనిలో ఉన్న 6,000mAh బాహుబలి బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడుగా 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. చాలా కంపెనీలు బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వడం మానేస్తున్న తరుణంలో, HMD మాత్రం ఫోన్ బాక్స్‌లోనే 18W ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది.

భద్రత కోసం ఫోన్ పక్కభాగంలో సైండ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. దుమ్ము, చిన్న చిన్న నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.0, వై-ఫై 5, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 5G నెట్‌వర్క్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ మొత్తం బరువు 210 గ్రాములు ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »