Nokia 250 4G Smart : ఇదేం కీప్యాడ్ ఫోన్ బాబోయ్.. ఫ్రంట్ ఫ్లాష్, AI ఫీచర్లతో వస్తున్న Nokia అదరగొట్టిందిగా

నోకియా 250 4G స్మార్ట్ ఫోన్లో ముందు భాగంలో ఫ్లాష్ లైట్‌తో కూడిన విజిఎ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

Nokia 250 4G Smart  : ఇదేం కీప్యాడ్ ఫోన్ బాబోయ్.. ఫ్రంట్ ఫ్లాష్, AI ఫీచర్లతో వస్తున్న Nokia అదరగొట్టిందిగా

Photo Credit: X/@smashx_60

Nokia 250 4G Smart

ముఖ్యాంశాలు
  • నోకియా నుంచి సూపర్ కీప్యాడ్ ఫోన్
  • నోకియా 250 4G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్
  • AI ఫీచర్లతో వస్తున్న నోకియా కీప్యాడ్ ఫోన్
ప్రకటన

Nokia 250 4G Smart  : మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎమ్‌డి బ్రాండ్ నుంచి నోకియా 250 4G స్మార్ట్ పేరుతో ఒక సరికొత్త ఫీచర్ ఫోన్ మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ కీప్యాడ్ ఫోన్ ఫీచర్లు, డిజైన్ లీకై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణ కీప్యాడ్ ఫోన్లకు భిన్నంగా ఇందులో స్మార్ట్‌ఫోన్లలో లభించే పలు మోడ్రన్ టెక్నాలజీ సౌకర్యాలను చేర్చడం విశేషం. ప్రముఖ టిప్‌స్టర్ @smashx_60 ఎక్స్ వేదికగా ఈ నయా ఫోన్ వివరాలను పంచుకున్నారు.

ఫ్రంట్ కెమెరాకి కూడా ఫ్లాష్ లైట్
సాధారణంగా ఫీచర్ ఫోన్లలో రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది, కొన్నింటిలో ఫ్రంట్ కెమెరా ఉన్నా ఫ్లాష్ లైట్ సదుపాయం ఉండదు. కానీ నోకియా 250 4G స్మార్ట్ ఫోన్లో ముందు భాగంలో ఫ్లాష్ లైట్‌తో కూడిన విజిఎ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. దీనివల్ల చీకటిలో కూడా స్పష్టమైన సెల్ఫీలు, వీడియోలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇక వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో 2.8 ఇంచుల LCD డిస్‌ప్లేతో పాటు టైపింగ్ కోసం క్లాసిక్ ఫిజికల్ కీప్యాడ్ లభిస్తుంది.

ప్రాసెసర్, స్టోరేజ్ వివరాలు
సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫోన్ యూనిసోక్ T137 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇది 1.3GHz క్లాక్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 256MBర్యామ్,  2GB ఇంటర్నెల్ స్టోరేజ్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ కీప్యాడ్ డెవైజ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. రోజూవారీ వాడకంలో వేగవంతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేలా దీని ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేశారు.

Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో

పెద్ద బ్యాటరీ,  అధునాతన AI ఫీచర్లు
ఫీచర్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా ఇందులో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన 1950mAh పెద్ద బ్యాటరీని అమర్చారు. అంతేకాకుండా ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్, బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎమ్ రేడియో సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు క్లౌడ్ ఫోన్ సపోర్ట్, AI టెక్నాలజీ, డ్యూయల్ LTE, హాట్‌స్పాట్, వాయిస్ ట్రాన్స్‌లేట్, స్పామ్ బ్లాకింగ్, క్యూఆర్ కోడ్ స్కేనర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ధర, లాంచ్ తేదీపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »