Photo Credit: EV
ఓలా ఎలక్ట్రిక్ ఈ వారం తన మూడవ తరం ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు జనరేషన్ 3 ప్లాట్‌ఫారమ్ రెండవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే నమ్మకమైన, నాణ్యత కలిగిన సర్వీసు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేలా అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కొత్త తరం ఉత్పత్తులను మొదట ఆగస్టు 2025లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ వేగవంతం చేసింది. తాజాగా, కొత్త స్కూటర్‌లను ఈ వారం చివర్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.
కంపెనీ CEO భవిష్ అగర్వాల్ X (గతంలో ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్ ప్రకారం.. జనవరి 31న ఉదయం 10:30 గంటలకు జనరేషన్ 3 EV స్కూటర్‌ల లాంచ్ జరుగుతుంది. దీని కొత్త ప్లాట్‌ఫారమ్ డిజైన్, ఫీచర్లు, పనితీరు పరంగా రెండవ తరం ఉత్పత్తులను అధిగమిస్తుందని భవిత్ ధీమా వ్యక్తం చేశారు. దీనితోపాటు ఉన్న టీజర్ చిత్రం స్కూటర్ డిజైన్‌కు సంబంధించి పూర్తి స్పష్టత నిస్తోంది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఓలా S1 ప్రో లాంటి ఇతర మోడల్స్ మాదిరిగానే కనిపిస్తోంది.
కంపెనీ తన Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విషయంలో క్వాలిటీ, సేవలపై ఉన్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా రూపొందించినట్లు చెబుతోంది. ఇటీవల కాలంలో ఈ అంశాలపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఇప్పటివరకు థర్డ్ పార్టీ సప్లయర్ల నుంచి విడి భాగాలను సేకరిస్తోన్న కంపెనీ, ఇకపై వాటిని సొంతంగా రూపొందించుకునేలా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో కంపెనీ మరింత పుంజుకునే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు భావిన్నాయి.
సెటప్‌ను పూర్తిగా మిడ్-మౌంట్‌కు తరలించడం ద్వారా సమస్యలను సరిదిద్దనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇది ఖర్చును తగ్గించడమే కాకుండా నాణ్యతను కూడా మరింత మెరుగుపరుస్తుందని విశ్వసిస్తోంది. ఫ్యాక్టరీ స్థాయిలో ఖర్చులను తగ్గించడానికి పెరిగిన ఆటోమేషన్‌తో పాటు, ప్రస్తుతం సరఫరాదారులకు అవుట్‌సోర్స్ చేయబడుతున్న అనేక భాగాల తయారీని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Gen 3 ప్లాట్‌ఫామ్ 20 శాతం పాయింట్ల తగ్గింపునకు కూడా సహాయపడుతుందని, ఇది పొదుపునకు దారితీస్తుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ సాంద్రతను పెంచుతూ ఖర్చును తగ్గించే మోటార్ ప్లాట్‌ఫారమ్ పునర్నిర్మించిన డిజైన్ కారణంగా ఇది సాధ్యమవుతుంది. అంతే కాదు, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫారమ్ ECUల సంఖ్యను తగ్గించడానికి, వాటిని ఒకే బోర్డులో అనుసంధానించడానికి రీ డిజైన్ చేయబడింది.
ప్లాస్టిక్ పొరలను తొలగించి ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ నిర్మాణాన్ని మార్పులు చేసింది. అలాగే, ఈ కొత్త మోడల్స్‌లో మ్యాగ్నెట్‌లెస్ మోటార్, ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ వంటివి తీసుకురావచ్చు. మరింత మెరుగైన టార్క్‌ను ఉత్పత్తి చేయడం మ్యాగ్నెట్‌లెస్ మోటార్ ప్రత్యేకత. దీంతో స్కూటర్ పెద్ద స్కూటర్‌ల కంటే కూడా మంచి పనితీరు కనబరిచేలా ఇంజిన్ సామర్థ్యం పెరగడంతో స్కూటర్ వేగంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతుంది.
ప్రకటన
ప్రకటన