థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని మోసపోయే వారికి శాంసంగ్ నేరుగా అందిస్తున్న ఈ సర్వీస్ ఒక మంచి భరోసా అని చెప్పవచ్చు.
Photo Credit: Samsung
Refurbished Samsung Galaxy S25 with 256GB of storage is listed for Rs. 58,749
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారతీయ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం గెలాక్సీ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం అధికారికంగా Certified Re-Newed ప్రోగ్రామ్‌ను ఇండియాలో ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపు ధరలతో కస్టమర్లకు విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ లైనప్‌లో లేటెస్ట్ గెలాక్సీ ఎస్25 సిరీస్, గెలాక్సీ ఏ సిరీస్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని మోసపోయే వారికి శాంసంగ్ నేరుగా అందిస్తున్న ఈ సర్వీస్ ఒక మంచి భరోసా అని చెప్పవచ్చు.
ఒరిజినల్ పార్ట్స్.. కొత్త బాక్స్, వన్-ఇయర్ వారంటీ!
శాంసంగ్ సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ కింద లభించే ప్రతి ఫోన్ ను కంపెనీకి చెందిన ప్రత్యేక నిపుణులు తనిఖీ చేస్తారు. ఇందులో ఫోన్ బాడీ కండిషన్, డిస్‌ప్లే, బ్యాటరీ పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ వాలిడేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏదైనా విడిభాగం సరిగ్గా పనిచేయకపోతే దాని స్థానంలో 100 శాతం ఒరిజినల్ శాంసంగ్ పార్ట్స్‌ను మాత్రమే రీప్లేస్ చేస్తారు. ఈ ఫోన్లలోని పాత డేటాను పూర్తిగా తొలగించి, సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో లోడ్ చేస్తారు. అంతేకాకుండా, ఈ ఫోన్లు సరికొత్త బాక్స్ ప్యాకింగ్‌తో పాటు క్విక్ స్టార్ట్ గైడ్, డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్‌తో వస్తాయి. సరికొత్త ఫోన్ కొంటే ఎలాంటి వన్-ఇయర్ బ్రాండ్ వారంటీ లభిస్తుందో.. ఈ రీ-న్యూడ్ ఫోన్లకు కూడా అదే వారంటీ వర్తిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా
శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ కొనాలని చాలా మందికి కల ఉంటుంది కానీ దాని భారీ ధర కారణంగా వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.97,499 ధరకే లభిస్తోంది. నిజానికి మార్కెట్లో దీని అసలు లాంచ్ ధర రూ.1,29,999గా ఉంది. అంటే ఈ రీ-న్యూడ్ మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా కస్టమర్లు ఏకంగా రూ.32,500 వరకు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. గెలాక్సీ ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ఇప్పుడు లక్ష లోపు బడ్జెట్‌లోనే అందుబాటులోకి రావడం విశేషం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25
కాంపాక్ట్ సైజులో ఉంటూ అదిరిపోయే ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వనిల్లా మోడల్ గెలాక్సీ ఎస్25 పై కూడా మంచి ఆఫర్ ఉంది. మార్కెట్లో సరికొత్త గెలాక్సీ ఎస్25 (12GB + 256GB) వేరియంట్ ధర రూ.62,999 ఉండగా.. శాంసంగ్ రీ-న్యూడ్ స్టోర్‌లో దీనిని కేవలం రూ.58,749 ధరకే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ డీల్ చాలా లాభదాయకంగా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ56
మిడ్-రేంజ్ విభాగంలో ప్రీమియం లుక్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకునే గెలాక్సీ ఏ56 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.44,999గా ఉంది. అయితే శాంసంగ్ సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ ద్వారా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఈ మోడల్‌ను కేవలం రూ.32,749కే ఆన్‌లైన్‌లో లిస్ట్ చేశారు. సుమారు రూ.12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో లభిస్తున్న ఈ మిడ్-రేంజ్ ఏఐ ఫోన్ బడ్జెట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ ఏ36
ఇక తక్కువ బడ్జెట్‌లో మంచి శామ్‌సంగ్ 5G ఫోన్ కావాలనుకునే వారి కోసం గెలాక్సీ ఏ36 కూడా రీ-న్యూడ్ కేటగిరీలో సిద్ధంగా ఉంది. మార్కెట్లో దీని ఒరిజినల్ ధర రూ. 32,999 కాగా.. ఈ ప్రోగ్రామ్ కింద 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.23,249కే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్లు అన్‌లాక్ చేయబడి రావడం వల్ల వినియోగదారులు తమకు నచ్చిన ఏ నెట్‌వర్క్ సిమ్ కార్డినైనా ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఈ ఫోన్లన్నీ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ (Samsung.com) లేదా శాంసంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999