శామ్‌సంగ్ గెలాక్సీ A27 5G స్మార్ట్‌ఫోన్ ధర అమెరికా మార్కెట్లో 349.99 డాలర్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.30,000) నిర్ణయించారు.
Photo Credit: Samsung Galaxy A27 5G
Samsung Galaxy A27 5G
Samsung Galaxy A27 5G : ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన గెలాక్సీ A సిరీస్‌ను మరింత బలోపేతం చేస్తూ గురువారం ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ A27 5G పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ ను భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఒకేసారి పరిచయం చేశారు. గత ఏడాది విడుదలైన గెలాక్సీ A26 5G కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త ఫోన్‌ను తీసుకువచ్చారు. ఇందులో అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌తో పాటు కస్టమర్లను ఆకట్టుకునే గ్లోబల్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ A27 5G స్మార్ట్‌ఫోన్ ధర అమెరికా మార్కెట్లో 349.99 డాలర్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.30,000) నిర్ణయించారు. అక్కడ జూలై 14 నుంచి బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. అయితే, భారతదేశంలో ఈ ఫోన్ అధికారిక ధరల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఇండియాలో జూలై 3వ తేదీ నుంచే ఈ మొబైల్ విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మన దేశంలో ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుంచే వస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఏకంగా ఆరు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో పాటు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని శామ్‌సంగ్ గ్యారెంటీ ఇచ్చింది. మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్లలో ఈ స్థాయి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ ఫోన్ లో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌కు జతగా 8GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మెమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, గెలాక్సీ A27 5G బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ గల 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనితో పాటు 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరాను కేటాయించారు.
ఈ కొత్త ఫోన్ లో శామ్‌సంగ్ తన ప్రీమియం ఫోన్లలో ఇచ్చే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా జోడించింది. ఇందులో స్క్రీన్ పై దేనినైనా సులభంగా సెర్చ్ చేసే సర్కిల్ టు సెర్చ్, ఫోటోలలోని అవాంఛిత వస్తువులను తొలగించే ఆబ్జెక్ట్ ఎరేజర్, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ లేదా బిక్స్‌బీ వంటి ఏఐ అసిస్టెంట్లను వాడుకోవచ్చు. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీ ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇచ్చారు. అలాగే డేటా భద్రత కోసం శామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని అందించారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals