Samsung Galaxy A57 5G : రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో శామ్‌సంగ్ సరికొత్త స్కెచ్

శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను కేవలం 6.9mm స్లిమ్ ప్రొఫైల్‌తో డిజైన్ చేయడం విశేషం.

Samsung Galaxy A57 5G : రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో శామ్‌సంగ్ సరికొత్త స్కెచ్

Samsung

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి శామ్‌సంగ్ కొత్త పవర్‌హౌస్
  • రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్
  • రాత్రి వేళల్లోనూ పగటిపూట లాంటి వీడియోలు
ప్రకటన

Samsung Galaxy A57 5G : ప్రస్తుత రోజుల్లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనడం అనేది వినియోగదారులకు పెద్ద టాస్క్‌గా మారింది. ప్రతి బ్రాండ్ తామే బెస్ట్ కెమెరా ఇస్తున్నామని, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామని కలర్‌ఫుల్ యాడ్స్ ఇస్తుంటాయి. కానీ, ఫోన్ కొని వాడుతున్నప్పుడు మాత్రమే అసలు విషయాలు బయటపడతాయి. ముఖ్యంగా రూ.50,000 లోపు బడ్జెట్‌లో ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే కెమెరా యావరేజ్‌గా ఉండటం, లేదా డిస్‌ప్లే బాగుంటే సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లేకపోవడం చూస్తుంటాం. ఈ సమస్యలన్నింటికీ గట్టి చెక్ పెడుతూ.. అన్ని విభాగాల్లోనూ పక్కాగా సరిపోయేలా సరికొత్త శామ్‌సంగ్ గెలాక్సీ A57 5G మార్కెట్లోకి అడుగుపెట్టింది.

ప్రీమియం లుక్, స్లిమ్ డిజైన్
సాధారణంగా పెద్ద బ్యాటరీలు ఉండే ఫోన్లు చాలా బరువుగా, లావుగా ఉంటాయి. కానీ శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను కేవలం 6.9mm స్లిమ్ ప్రొఫైల్‌తో డిజైన్ చేయడం విశేషం. కేవలం 179 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల గంటల తరబడి చేతిలో పట్టుకుని గేమింగ్ ఆడినా, సోషల్ మీడియా బ్రౌజ్ చేసినా చేతులు అస్సలు నొప్పి పుట్టవు. దీనికి వాడిన మెటల్ ఫ్రేమ్ ఫోన్‌కు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఈ ఫోన్ ఆసమ్ నేవీ, ఆసమ్ ఐసీబ్లూ, ఆసమ్ లైలాక్ అనే మూడు అదిరిపోయే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

సినిమా హాల్ లాంటి సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే
ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో సూపర్ అమోలెడ్ ప్లస్  డిస్‌ప్లేను అమర్చారు. ఇది 3,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల స్క్రీన్ పై కనిపించే కలర్స్ చాలా రిచ్‌గా, విజువల్స్ అత్యంత స్పష్టంగా ఉంటాయి. చీకటిగా ఉండే సీన్లు చూసేటప్పుడు కూడా షాడోస్, డీటెయిల్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. థియేటర్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ డిస్‌ప్లే యూజర్లకు అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
 


Samsung Mobile Galaxy A series Galaxy A57 5G Galaxy A37 5G Latest Innovation main10

చీకట్లోనూ అదరగొట్టే నైటోగ్రఫీ వీడియో కెమెరా
స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఎంత అప్‌గ్రేడ్ అయినా రాత్రి వేళల్లో వీడియోలు తీసేటప్పుడు మాత్రం నాయిస్ వస్తుంటుంది. ఈ లోపాన్ని సరిచేస్తూ శామ్‌సంగ్ ఇందులో  నైటోగ్రఫీ వీడియో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌లోని 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకు OIS, VDIS టెక్నాలజీ సపోర్ట్ ఉంది. దీనివల్ల మనం నడుస్తూ లేదా ప్రయాణిస్తూ వీడియోలు తీసినా కూడా షేక్ అవ్వకుండా, రాత్రి వేళల్లో తక్కువ నాయిస్‌తో క్రిస్టల్ క్లియర్ అవుట్‌పుట్ వస్తుంది. పగటిపూట లైటింగ్‌ను బట్టి ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయి అద్భుతమైన ఫోటోలను ఇస్తుంది.

నిజ జీవితంలో ఉపయోగపడే ప్రాక్టికల్ ఏఐ ఫీచర్లు
చాలా ఫోన్లలో కేవలం పేరుకే ఏఐ ఫీచర్లు ఉంటాయి తప్ప, వాడుకలో పెద్దగా ఉపయోగపడవు. కానీ శామ్‌సంగ్ ఇందులో రోజువారీ లైఫ్‌లో పనికొచ్చే ఏఐ టూల్స్ ఇచ్చింది. AI పోర్ట్రెయిట్స్ ఫీచర్ ద్వారా మన చర్మం, జుట్టు, వెనుక ఉన్న స్కైని గుర్తించి ఫోటోను సోషల్ మీడియా క్వాలిటీకి ఆటోమేటిక్‌గా ఎడిట్ చేస్తుంది. అలాగే గ్రూప్ ఫోటోలు తీసేటప్పుడు ఎవరైనా కళ్లు మూసుకుంటే,  బెస్ట్ ఫేస్ ఫీచర్ ద్వారా వేరే ఫ్రేమ్ నుంచి మంచి ఎక్స్‌ప్రెషన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో వద్దనుకున్న వస్తువులను తొలగించడానికి  ఆబ్జెక్ట్ ఎరేజర్ టూల్ కూడా ఉంది.

మల్టీటాస్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్
గెలాక్సీ A57 5G ఫోన్‌లో పర్ఫార్మెన్స్ పరంగా భారీ అప్‌గ్రేడ్స్ చేశారు. ఇందులో సరికొత్త ఎల్‌పీడీడీఆర్5 రామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఉపయోగించారు. పాత మోడళ్లతో పోలిస్తే దీని సీపీయూ (CPU) పర్ఫార్మెన్స్ 15 శాతం, జీపీయూ (GPU) పర్ఫార్మెన్స్ 15 శాతం, ఏఐ పనులను చూసుకునే ఎన్‌పీయూ పర్ఫార్మెన్స్ ఏకంగా 33 శాతం పెరిగాయి. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఉండటం కోసం ఇందులో ఫ్లాగ్‌షిప్ లెవెల్ లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.

రెండు రోజుల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్
ఈ ఫోన్‌లో 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు. శామ్‌సంగ్ అడ్వాన్స్‌డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్, అడాప్టివ్ డిస్‌ప్లే, డీప్ స్లీప్ ఇంజన్ సాంకేతికత వల్ల ఈ ఫోన్ ఒకే ఒక్క ఛార్జ్‌తో సులభంగా రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో 45W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్ 60 శాతం ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఛార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.
 


A5705 1 Camera Specs PC


IP68 రేటింగ్, 6 సంవత్సరాల భద్రత
గెలాక్సీ 'A' సిరీస్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఫోన్‌కు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. అంటే అనుకోకుండా ఫోన్ నీళ్లలో పడినా లేదా వర్షంలో తడిచినా ఏమీ కాదు. ఫోన్ ముందు, వెనుక భాగంలో అత్యంత బలమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్‌కు ఏకంగా 6 జనరేషన్ల ఓఎస్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని శామ్‌సంగ్ గ్యారెంటీ ఇచ్చింది. అంటే ఆరేళ్ల పాటు మీ ఫోన్ సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో సేఫ్‌గా రన్ అవుతుంది.


A5715 AP PC

వన్ యూఐ 8.5, ధరల వివరాలు
ఈ ఫోన్ లేటెస్ట్ వన్ యూఐ 8.5 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఇందులో గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్ ఇన్-బిల్ట్‌గా వస్తుంది. మన పర్సనల్ డేటా భద్రత కోసం శామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ప్రైవేట్ ఆల్బమ్ ఫీచర్లు ఉన్నాయి. ధరల విషయానికి వస్తే.. 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,499 కాగా, 12GB రామ్ + 256GB టాప్ ఎండ్ మోడల్ ధర రూ.52,499 గా ఉంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద రూపాయి డౌన్ పేమెంట్ లేకుండా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, ఇదే సిరీస్‌లో రూ.36,499 ప్రారంభ ధరతో లభించే గెలాక్సీ A37 5Gని కూడా మీరు పరిశీలించవచ్చు. దీనిపై రోజుకు కేవలం రూ.50 వచ్చేలా ఈఎంఐ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Screenshot 2026 04 03 at 102242AM

 

Screenshot 2026 04 03 at 101642AM

 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »