లండన్‌లో జరగబోయే ఈ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
Samsung
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్ యూకేలోని లండన్ నగరంలో జూలై 22, 2026న అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ వేదికపై శాంసంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, ప్రీమియం మోడల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ సరికొత్త ఫోన్లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి, వీటి ధర ఎంత ఉండబోతోంది అనే విషయాలు ఈవెంట్ రోజున రివీల్ కానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఎలా చూడాలి?
లండన్‌లో జరగబోయే ఈ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే మన భారతీయ కాలమానం (IST) ప్రకారం జూలై 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఈ ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులు, కస్టమర్లు ఎక్కడి నుండైనా లైవ్‌లో వీక్షించవచ్చు. దీని కోసం శాంసంగ్ కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ (Samsung.com)తో పాటు శాంసంగ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
భారత్‌లో మొదలైన ప్రీ-రిజర్వేషన్లు
గ్లోబల్ లాంచ్‌కు ముందే భారతీయ వినియోగదారుల కోసం శాంసంగ్ ఇండియా స్టోర్‌లో ఈ అడ్వాన్స్డ్ ఫోన్ల ప్రీ-రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సరికొత్త గెలాక్సీ డివైజ్‌లను అందరికంటే ముందే సొంతం చేసుకోవాలనుకునే వారు కేవలం రూ.999 టోకెన్ అమౌంట్ చెల్లించి ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా ముందే బుక్ చేసుకునే కస్టమర్లకు శాంసంగ్ సంస్థ రూ.2,799 విలువైన షాపింగ్ వోచర్‌ను ఉచితంగా కానుకగా ఇవ్వబోతోంది. ఈ ప్రీ-రిజర్వేషన్ విండో జూలై 22 వరకు లేదా అఫీషియల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యే సమయం వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ వీఐపీ పాస్ పొందడం ఎలా?
ఈ సరికొత్త గెలాక్సీ ఫోన్ల కోసం ప్రీ-రిజర్వ్ వీఐపీ పాస్ పొందడం చాలా సులభం. మొదటగా మీరు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అక్కడ ఉన్న ప్రీ-రిజర్వ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా ఆన్‌లైన్ ప్రిపేయిడ్ పేమెంట్ (యూపీఐ, కార్డ్స్ లేదా నెట్ బ్యాంకింగ్) ఆప్షన్ ద్వారా రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ విజయవంతం అయిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్‌కు వీఐపీ పాస్ అందుతుంది. ఆ తర్వాత మీకు వచ్చే వెల్‌కమ్ ఈమెయిల్‌లో ఆఫర్ల పూర్తి వివరాలు ఉంటాయి. ఫోన్ సేల్స్ మొదలైనప్పుడు మీరు ఆ కూపన్ కోడ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అప్పుడు మీరు ముందుగా కట్టిన రూ.999 కారు అసలు ధరలో అడ్జస్ట్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ప్రీ-బుకింగ్ ముగిసేలోపు కూపన్ వాడకపోతే, ఆ కూపన్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయి, మీ రూ.999 డబ్బులు మీ అకౌంట్‌కు రిఫండ్ అవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ Z Fold 8, Z Fold 8 Ultra లీకైన మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు
లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ Z Fold8 లో 7.6 ఇంచుల సైజ్ గల డైనమిక్ అమోలెడ్ 2X మెయిన్ ఇన్నర్ డిస్‌ప్లే ఉండబోతోంది. ఇది 120Hz LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4:3 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇక బయటి వైపు 5.5 ఇంచుల ఔటర్ డిస్‌ప్లేను ఇస్తున్నారు, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఆల్ట్రా చిప్‌సెట్ ఇవ్వనున్నారు. దీనికి తోడుగా 12GB ర్యామ్, భారీ 1TB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది. కాగా, ప్రీమియం మోడల్ అయిన గెలాక్సీ Z Fold8 Ultra లో ఏకంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 5,000mAh బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 25W నుంచి 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z Flip 8 ప్రొసెసర్, స్టోరేజ్ వేరియంట్లు
చిన్నగా, స్టైలిష్‌గా ఉండే ఫోన్లను ఇష్టపడే వారి కోసం వస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Flip8 మోడల్ కూడా సూపర్ ఫీచర్లతో రాబోతోంది. ఇందులో మార్కెట్‌ను బట్టి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్ లేదా శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2600 పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. మల్టీటాస్కింగ్ స్మూత్‌గా సాగేందుకు ఇందులో బేసిక్‌గానే 12GB భారీ ర్యామ్‌ను అందించబోతున్నారు. స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ 256GB, 512GB అనే రెండు వేర్వేరు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999