Samsung : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. త్వరలోనే మార్కెట్లోకి శామ్‌సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7.6 ఇంచుల QHD+ డైనమిక్ అమోలెడ్ 2X ప్రధాన డిస్‌ప్లేను అందించనున్నారు.

Samsung : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. త్వరలోనే మార్కెట్లోకి శామ్‌సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు

Photo Credit: Samsung Galaxy Z Fold 7

Samsung Galaxy Z Fold 7

ముఖ్యాంశాలు
  • టెక్ మార్కెట్లో శామ్‌సంగ్ సరికొత్త సంచలనం
  • గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ సిరీస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు!
  • పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో ఎంట్రీ
ప్రకటన

Samsung : ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సరికొత్త మోడళ్లను పరిచయం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెలలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక galaxy unpacked ఈవెంట్‌లో కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ సరికొత్త లైనప్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8లతో పాటు మొదటిసారిగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు లాంచ్ కాకముందే వీటికి సంబంధించిన పలు ఆసక్తికరమైన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్ వేదికగా లీకయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ అహ్మద్ ఖ్వైదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  X ద్వారా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. లీకైన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7.6 ఇంచుల QHD+ డైనమిక్ అమోలెడ్ 2X ప్రధాన డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోన్‌ను మడతబెట్టినప్పుడు ఉపయోగపడే కవర్ స్క్రీన్ 5.5 ఇంచుల సైజులో, అదే క్వాలిటీ, రిఫ్రెష్ రేట్‌తో రానుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో ఏకంగా 12 GB ర్యామ్,  గరిష్టంగా 1 TB వరకు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా దుమ్మురేపడానికి క్వాల్కమ్ సంస్థకు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఇక ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు,  వీడియో కాల్స్ కోసం ఇన్నర్, ఔటర్ రెండు డిస్‌ప్లేలపై 10 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. ఈ ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఇందులో 4,800 mAh బ్యాటరీ ఉండనుండగా, ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

గత ఏడాది జూలైలో భారత మార్కెట్లో విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 తో పోలిస్తే కొత్త మోడల్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. పాత జెడ్ ఫోల్డ్ 7 మోడల్‌లో 8 ఇంచుల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లే (1,856 x 2,160 పిక్సెల్స్) ఉండేది. ఇది 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే దీని కవర్ డిస్‌ప్లే 6.5 ఇంచుల ఫుల్ HD+ స్క్రీన్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 సాఫ్ట్‌వేర్‌పై నడిచే ఈ పాత ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కెమెరా విభాగంలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 200 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అయితే కొత్తగా రాబోయే ఫోల్డ్ 8 లో ట్రిపుల్ కెమెరాకు బదులు 50+50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పాత ఫోల్డ్ 7 లో బ్యాటరీ సామర్థ్యం 4,400 mAh మాత్రమే కాగా, అది కేవలం 25W వైర్డ్ ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేసేది. కానీ కొత్త ఫోల్డ్ 8 లో బ్యాటరీని 4,800 mAhకి పెంచడంతో పాటు సూపర్ ఫాస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లను జోడించడం విశేషం. గూగుల్ డిస్కవరీ లో ఈ కొత్త ఫోన్ల లీక్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »