Samsung Galaxy Z Fold 8 Ultra launched, Price Starts at Rs.1,99,999 only: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో లోపలి భాగంలో 8 అంగుళాల AMOLED ప్రైమరీ డిస్‌ప్లే, వెలుపల 6.5 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ రెండూ 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి.
Photo Credit: Samsung
Samsung Galaxy Z Fold 8 Ultra
Samsung Galaxy Z Fold 8 Ultra Launched, Price Starts at Rs.1,99,999 only: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ గ్లోబల్ మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించింది. లండన్‌లో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అత్యంత పవర్ఫుల్ శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ డిస్‌ప్లే, సరికొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, అడ్వాన్స్‌డ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో రూపొందిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డిస్‌ప్లే, బిల్డ్ క్వాలిటీ
శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రాలో లోపలి భాగంలో 8 అంగుళాల AMOLED ప్రైమరీ డిస్‌ప్లే, వెలుపల 6.5 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ రెండూ 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. ప్రైమరీ డిస్‌ప్లే ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కవర్ డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వాడారు. ఫోన్ కిందపడినా దెబ్బతినకుండా ఉండేందుకు స్క్రీన్ మడత భాగం తక్కువగా కనిపించేందుకు ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీని ఉపయోగించారు. ఇది IP48 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.
ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అత్యంత వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్‌తో ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా పెద్ద గ్రేఫైట్ కూలింగ్ స్ట్రక్చర్ అమర్చారు. గెలాక్సీ ఏఐలో భాగంగా నౌ బ్రీఫ్, నౌ నడ్జ్, జెమిని ఇంటెలిజెన్స్ ఫీచర్లు తెచ్చారు. గూగుల్ జెమిని ద్వారా 40 కంటే ఎక్కువ యాప్‌లలో పనులను ఆటోమేటిక్‌గా పూర్తి చేయవచ్చు.
కెమెరా సిస్టమ్, బ్యాటరీ
కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అమర్చారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.
ధరలు, ఆఫర్లు, కలర్స్
భారత మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా వేరియంట్ల వారీ ధరల వివరాలు:
12GB + 256GB: రూ.1,99,999
12GB + 512GB: రూ.2,19,999
16GB + 1TB: రూ.2,59,999
ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, వయోలెట్ రంగుల్లో లభిస్తుంది. శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా గ్రీన్ షాడో ఫినిష్ అందుబాటులో ఉంటుంది. ఆరంభ ఆఫర్ కింద రూ.5,000 తక్షణ డిస్కౌంట్, 5TB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు 6 నెలల గూగుల్ AI ప్రో ట్రయల్ ఉచితంగా లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features