Gemini Intelligence will reportedly reach the Galaxy S26 and Pixel 10 series at a later stage.
Google showcased the Gemini Intelligence features in The Android Show I/O Edition
Samsung : స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రేసులో శామ్సంగ్ అందరికంటే ముందుండాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. తాజాగా వస్తున్న నివేదికల ప్రకారం, శామ్సంగ్ రాబోయే ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8 సరికొత్త గూగుల్ జెమిని ఇంటెలిజెన్స్ ఫీచర్లతో లాంచ్ కానున్నాయి. సాధారణంగా ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ముందుగా పిక్సెల్ ఫోన్లలో రావాలి, కానీ గూగుల్ తన ప్రాణ మిత్రుడు శామ్సంగ్ కోసం ఈ రూల్ మార్చేసినట్లు కనిపిస్తోంది.
ఏమిటీ జెమిని ఇంటెలిజెన్స్?
ఈ జెమిని ఇంటెలిజెన్స్ అనేది మీ ఫోన్ వాడే విధానాన్నే మార్చేస్తుంది. ఉదాహరణకు మీరు మీ నోట్స్ యాప్‌లో ఒక షాపింగ్ లిస్ట్ రాసుకున్నారనుకోండి.. మీరు కేవలం ఏఐకి చెబితే చాలు, ఆ లిస్ట్‌లోని వస్తువులన్నీ ఆటోమేటిక్‌గా ఒక డెలివరీ యాప్ కార్ట్‌లోకి వెళ్ళిపోతాయి. మీరు ఆ యాప్‌లోకి వెళ్లి వెతకాల్సిన పనిలేదు. యాప్స్ మధ్య స్విచ్ అవ్వడం, వస్తువులను ఆర్గనైజ్ చేయడం, పేమెంట్ వరకు ప్రాసెస్ చేయడం అంతా ఏఐ చూసుకుంటుంది. మల్టీ టాస్కింగ్ చేయడంలో ఇది ఒక మాయాజాలంలా పనిచేస్తుంది.
వన్ యూఐ 9తో ఎంట్రీ
శామ్సంగ్ తన తదుపరి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వన్ యూఐ 9తో ఈ జెమిని ఇంటెలిజెన్స్ ను జూలైలో లాంచ్ చేయబోయే ఫోల్డబుల్ ఫోన్లలో ప్రవేశపెట్టనుంది. జూలైలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లు ప్రపంచం ముందుకు వస్తాయి. గెలాక్సీ S26 సిరీస్, గూగుల్ పిక్సెల్ 10 కంటే ముందే ఫోల్డ్ 8, ఫ్లిప్ 8లలో ఈ ఫీచర్లు రావడం విశేషం. శామ్సంగ్ నోట్స్‌లో మాస్కింగ్ టేప్ అనే పెన్ కస్టమైజేషన్ ఫీచర్, కాంటాక్ట్స్ యాప్‌లో ప్రొఫైల్ కార్డ్స్ క్రియేట్ చేసే క్రియేటివ్ స్టూడియో వంటివి కూడా ఇందులో ఉండబోతున్నాయి.
ఫోన్లే కాదు.. వాచీలు, కార్లలో కూడా
గూగుల్ ఈ జెమిని ఇంటెలిజెన్స్ ను కేవలం ఫోన్లకే పరిమితం చేయడం లేదు. ఈ ఏడాది చివర్లో ఆండ్రాయిడ్ వాచీలు, స్మార్ట్ గ్లాసెస్, ల్యాప్‌టాప్‌లు, కార్లలో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దీనివల్ల మీ గూగుల్ అకౌంట్ తో లింక్ అయిన అన్ని డివైజ్‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ మీ పనులను సులభతరం చేస్తాయి. శామ్సంగ్ ఫోల్డ్ 8లో ఈ ఫీచర్ రావడం వల్ల పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లలో పని చేయడం మరింత సరదాగా మారుతుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains