ఫోన్ అన్‌లాక్ చేయడానికి కస్టమర్లకు కేవలం 13 ఛాన్సులు మాత్రమే లభిస్తాయి.
Photo Credit: iStock/megaflopp
Samsung One UI 9.0
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తమ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వన్ UI 9.0లో సెక్యూరిటీ ఫీచర్లను మరింత కఠినతరం చేసింది. తమ యూజర్ల డేటాను ఇతరులు దొంగిలించకుండా లేదా ఫోన్‌ను అక్రమంగా అన్‌లాక్ చేయకుండా నిరోధించడానికి లాక్‌స్క్రీన్ సెక్యూరిటీ పాలసీని పూర్తిగా మార్చేసింది. ఈ అప్‌డేట్ ప్రకారం.. ఒకవేళ మీరు మీ శామ్‌సంగ్ ఫోన్ లేదా టాబ్లెట్ పాస్‌వర్డ్, పిన్ లేదా ప్యాటర్న్‌ను మర్చిపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పరిమితికి మించి తప్పు ప్రయత్నాలు చేస్తే మీ మొబైల్‌లోని డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని శామ్‌సంగ్ తమ అధికారిక బ్లాగ్ ద్వారా హెచ్చరించింది.
అన్‌లాకింగ్ కోసం కేవలం 13 ఛాన్స్‌లు మాత్రమే
కొత్త సెక్యూరిటీ పాలసీ ప్రకారం.. ఫోన్ అన్‌లాక్ చేయడానికి కస్టమర్లకు కేవలం 13 ఛాన్సులు మాత్రమే లభిస్తాయి. మొదటి 5 సార్లు తప్పు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఫోన్ 1 నిమిషం పాటు లాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రతీ తప్పు ప్రయత్నానికి లాకౌట్ సమయం విపరీతంగా పెరుగుతూ పోతుంది. 6వ ప్రయత్నంలో 5 నిమిషాలు, 7వ సారికి 15 నిమిషాలు, 8వ సారికి 30 నిమిషాలు, 9వ సారికి 90 నిమిషాలు, 10వ సారికి 4 గంటలు, 11వ సారికి 12 గంటలు, 12వ ప్రయత్నంలో కూడా తప్పు కొడితే ఏకంగా 24 గంటల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఇక చివరిగా 13వ సారి కూడా తప్పు పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఫోన్ శాశ్వతంగా లాక్ అయిపోతుంది.
iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
డేటా పోకుండా ఉండాలంటే ఫ్యాక్టరీ రీసెట్ ఒక్కటే మార్గం
ఒకసారి 13 ప్రయత్నాలు పూర్తయి ఫోన్ పర్మానెంట్‌గా లాక్ అయిపోతే, దానిని అన్‌లాక్ చేయడానికి ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం తప్ప మరో మార్గం ఉండదు. అయితే ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, లోకల్ డేటా అంతా శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ ఫోన్ డేటాను క్లౌడ్ లేదా శామ్‌సంగ్ స్మార్ట్ స్విచ్ ద్వారా క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవాలని కంపెనీ ప్రత్యేకంగా సూచించింది.
స్మార్ట్ కౌంటింగ్ మెకానిజం ఎలా పనిచేస్తుంది?
యూజర్లకు ఊరట కలిగించే అంశం ఏంటంటే.. శామ్‌సంగ్ ఇందులో స్మార్ట్ కౌంటింగ్ మెకానిజంను పరిచయం చేసింది. దీని ప్రకారం, యూజర్ పొరపాటున ఒకే తప్పు పిన్ లేదా ప్యాటర్న్‌ను పదే పదే టైప్ చేస్తే, దానిని కేవలం ఒక్క తప్పు ప్రయత్నంగానే సిస్టమ్ లెక్కిస్తుంది. ప్రతిసారీ వేర్వేరు తప్పు ఎంట్రీలు ఇస్తేనే కౌంటర్ ముందుకెళ్తుంది. అంతేకాకుండా మీరు గరిష్ట పరిమితికి దగ్గరపడుతున్నప్పుడు స్క్రీన్‌పై మిగిలి ఉన్న అవకాశాల గురించి స్పష్టమైన హెచ్చరిక సందేశాలను కూడా కంపెనీ డిస్ప్లే చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999