ఇండియాలో స్టార్‌లింక్ అనుమతులు పొందినట్లయితే, కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్‌తో పాటు రిలయన్స్ జియో స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.
Photo Credit: Reuters
రిలయన్స్ జియో స్టోర్లలో కస్టమర్లు స్టార్‌లింక్ పరికరాలను కొనుగోలు చేయగలరని కంపెనీ తెలిపింది.
భారత్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, స్పేస్‌ఎక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అత్యంత మారుమూల, గ్రామీణ ప్రాంతాలలో కూడా తమ వినియోగదారులకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ యూనిట్‌ను ఉపయోగించు కోనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ప్రకటించింది. ఇండియాలో స్టార్‌లింక్‌ను విక్రయించడానికి SpaceX కంట్రోల్ అధికారుల నుండి అనుమతులు పొందినట్లయితే, కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్‌తో పాటు రిలయన్స్ జియో స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.
తాజాగా, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. స్టార్‌లింక్ తమ ప్రస్తుత హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలైన జియోఎయిర్ ఫైబర్, జియోఫైబర్‌లను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే, ఇది మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సధుపాయాలను సరసమైన ధరలలో, త్వరితగతిన అందించనున్నట్లు తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. టెలికాం ప్రొవైడర్ ఆశయాలకు అనుగుణంగా కంపెనీకి మాత్రమే కాకుండా, చిన్న- మధ్యతరహా వ్యాపారాలతోపాటు మన దేశమంతటా ఉన్న కమ్యూనిటీలకు కూడా హై- స్పీడ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చని అభిప్రాయపడుతోంది.
SpaceX కంట్రోల్ అధికారుల నుండి అనుమతులు మంజూరు చేసిన తర్వాత కస్టమర్లు రిలయన్స్ జియో స్టోర్ల నుండి స్టార్‌లింక్ పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, టెలికాం ప్రొవైడర్ ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ తరపున కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ సేవలను కూడా అందిస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్నే షాట్‌వెల్ మాట్లాడుతూ.. తాము జియోతో కలిసి పనిచేయడానికి, స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను మరింత మంది వ్యక్తులకు, సంస్థలు, వ్యాపారాలకు అందించడానికి భారత ప్రభుత్వం నుండి అనుమతులు పొందేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మన దేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఈ రెండు కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూనే సమకారానని అందించేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధలు చెబుతున్నారు. అలాగే, ఇందులో స్టార్‌లింక్ విస్తారమైన లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ యూనిట్ కూడా ఉంది. ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు తక్కువ-జాప్యంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే దాదాపు 7,000 యాక్టీవ్ శాటిలైట్స్ ఉన్నట్లు అంచనా.
అంతేకాదు, స్పేస్‌ఎక్స్, భారతీ ఎయిర్‌టెల్ మధ్య ఇలాంటి పాట్నర్‌షిప్‌ను ప్రకటించిన తర్వాత ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ సంతకం చేసిన రెండవ ఒప్పందం ఇది. ఇది మన దేశంలోని తమ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను కూడా విక్రయిస్తుంది. ఎయిర్‌టెల్ బిజినెస్ కస్టమర్లు, కమ్యూనిటీలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర వాటికి స్టార్‌లింక్ సేవలను అందించాలని భావిస్తున్నారు. ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. గ్రామీణ ప్రాంతాలు కూడా హై స్పీడ్ ఇంటర్‌నెట్ సధుపాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Microsoft Announces Latest Windows 11 Insider Preview Build With Ask Copilot in Taskbar, Shared Audio Feature
Samsung Galaxy S26 Series Specifications Leaked in Full; Major Camera Upgrades Tipped