రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి

ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్‌-స‌పోర్ట్‌ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు

రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి

Photo Credit: Jio

రిలయన్స్ జియో ప్లాన్‌లను ఎంచుకోండి, అవి జియో హాట్‌స్టార్‌కు ఉచిత ప్రకటన-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి

ముఖ్యాంశాలు
  • ఈ రూ. 100 రీఛార్జ్ ప్లాన్ 5GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది
  • ప్లాన్ డేటా అలవెన్స్ అయిపోతే, డౌన్‌లోడ్ వేగం 64kbpsకి తగ్గించబడుతుంది
  • JioHotstar యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌కు సాధారణంగా నెలకు రూ. 149 ఖర్చవుతుంది
ప్రకటన

మ‌న దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీని ద్వారా కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar నుండి కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేందుకు అవ‌కాశాం క‌ల్పిస్తోంది. ఇది ప్లాన్ ప్రయోజనాలతో పాటు ఉచిత JioHotstar సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. JioCinema, Disney+ Hotstar విలీనం తర్వాత ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇటీవల భార‌త్‌లో లాంఛ్ చేయ‌బ‌డింది. ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్‌-స‌పోర్ట్‌ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.

90 రోజుల కాల ప‌రిమితితో

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్స్‌ ఇప్పుడు నిర్దిష్ట ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవ‌డం JioHotstar కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. అలాగే, మొబైల్ వినియోగదారుల కోసం రూ. 100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల కాల ప‌రిమితితో JioHotstar కు ఉచిత యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇది వినియోగ‌దారుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని రిలయన్స్ జియో స్ప‌ష్టం చేసింది. అంతే కాదు, విలీనం త‌ర్వాత కంపెనీ నుంచి అందిస్తోన్న బెస్ట్ ప్లాన్‌గా మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

మొబైల్ లేదా టీవీ రెండింటిలోనూ

ఈ కొత్త‌ ప్లాన్ కూడా 90 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. కస్టమర్స్‌ మొత్తం 5GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవ‌చ్చు. అలాగే, ప్లాన్ డేటా అలవెన్స్ అయిపోయిన తర్వాత, డౌన్‌లోడ్ వేగం 64kbpsకి తగ్గించబడుతుందని ఈ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్ వెల్ల‌డించింది. అయితే, కాంప్లిమెంటరీ JioHotstar సబ్‌స్క్రిప్షన్ మొబైల్ లేదా టీవీ రెండింటిలోనూ పనిచేయ‌డం అధ‌న‌పు ప్ర‌యోజ‌నంగా చెప్పొచ్చు.

3,00,000 గంటల విలువైన

ప్ర‌ధానంగా, JioHotstar యాడ్‌-సపోర్టెడ్ ప్లాన్ నెలకు రూ. 149 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ప్ర‌క‌టించింది. ఇది 720p రిజల్యూషన్‌లో ఒక మొబైల్ డివైజ్‌లో కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తోంది. టాప్-ఎండ్ JioHotstar ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 299, సంవత్సరానికి రూ. 1,499గా నిర్ణ‌యించారు. అంతే కాదు, ఈ టెలికాం ప్రొవైడర్ ఇది లైవ్ స్పోర్ట్స్ కవరేజీతో పాటు దాదాపు 3,00,000 గంటల విలువైన సినిమాలు, షోలు, అనిమే, డాక్యుమెంటరీలను కలిగి ఉందని తెలిపింది.

ఇంటర్నెట్‌తోపాటు ఇతర ప్రయోజనాలు

అలాగే, ఎక్కువ డేటాతో అధిక ధరల ప్లాన్‌లను ఎంపిక చేసుకోవాల‌నుకునే వారు రూ. 195 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. క్రికెట్ డేటా ప్యాక్‌గా పరిచయం చేయబడిన దీనిలో 15GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌తోపాటు ఇతర ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. అలాగే, వాయిస్ కాలింగ్, SMS కూడా కావాల‌నుకునే వారు రూ. 949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌ మొత్తం 90 రోజుల కాల ప‌రిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటాను అందిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. కొత్త ఏడాదిలో సామ్ సంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో రానున్న టీవీలు.. ప్రత్యేకతలు ఇవే
  2. మార్కెట్లోకి హానర్ విన్, విన్ ఆర్‌టి మోడల్స్.. కీ ఫీచర్స్ గురించి తెలుసా?
  3. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  4. Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.
  5. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  6. స్ట్రాటజీతో రేట్లు పెంచేసిన సామ్ సంగ్.. ఇక నెక్ట్స్ ఐఫోన్ వంతు
  7. వీటిలో ఇప్పటికే 3,500 పోస్టులు భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు.
  8. అంతేకాదు, భారీగా 9,000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  9. అదిరే కెమెరా ఫీచర్స్‌తో ఒప్పో Find X9.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  10. ఇది 2026 వసంతకాలంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »