Photo Credit: Reliance
మన దేశంలో Reliance Jio 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల పరిమిత సభ్యత్వంతోపాటు అర్హత ఉన్న ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ-కామర్స్ వోచర్‌లతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. Jio మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా ఇటీవల భారతదేశంలోని తన కస్టమర్‌ల కోసం ముఖ్యమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. Jio ఇప్పటివరకూ సుమారు 490 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు సేవలను అందిస్తోంది.
తాజాగా Jio 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు రీచార్జ్ ప్లాన్‌లపై ఆసక్తికరమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 మధ్య ప్రత్యేక ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే సబ్‌స్క్రైబర్‌లు రూ. 700 విలువైన మూడు ప్రయోజనాలకు అర్హులు. ఈ త్రైమాసికానికి చెల్లుబాటు అయ్యే రూ. 899, రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు వరుసగా 90, 98 రోజుల చెల్లుబాటుతో ఒక్కొక్కటి 2GB రోజువారీ డేటాను అందిస్తాయి. అపరమిత కాల్స్‌తోపాటు రోజువారీ వంద ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అలాగే, రూ. 3,599 చందాదారులు వార్షిక ప్లాన్‌ను 365 రోజుల కాలపరిమితితో పాటు 2.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. దీని ద్వారా కూడా పలు ఆఫర్‌లను సొంతం చేసుకోవచ్చు.
Reliance Jio ప్రకటన ప్రకారం.. Zee5, SonyLiv, JioCinema Premium, Lionsgate Play, Discovery+, SunNxt, Kanchha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi, JioTV వంటి OTT యాప్‌లను 28 రోజుల వ్యాలిడిటీతో యాక్సెస్‌ను పొందవచ్చునని తెలిపింది. దీని విలువ రూ. 175 కాగా, 10GB డేటా వోచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచితంగా మూడు నెలల Zomato గోల్డ్ సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులు తమకు ఇష్టమైన రెస్టారెంట్‌లలో భోజనం ఆర్డర్ చేసి మంచి డిస్కౌంట్ ఆఫర్‌లను సొంతం చేసుకోవచ్చు. అలాగే, AJIOలో దీని కొనుగోళ్లకు రూ. 500 వోచర్‌ను అందుకోవచ్చు. ఇది రూ. 2999 కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై రీడీమ్ చేసుకోవచ్చు.
ఈ టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా, ఇది కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు రూ. 1,299, రూ. 1,799గా ఉన్నాయి. గత ధరలతో వీటిని పోల్చి చూస్తే.. వరుసగా రూ. 1,099, రూ. 1,499 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రూ. 1,299 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది మాత్రం మొబైల్ పరికరాలలో మాత్రమే స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే, రూ. 1,799లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌తో వస్తుంది.
ప్రకటన
ప్రకటన