500 కంటే ఎక్కువ లైవ్‌ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..

IFTVగా పిలువబడే ఈ సేవలను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ కొత్త లోగో, ఆరు కొత్త సౌకర్యాలను గత నెలలో మొదటిసారిగా పరిచయం చేసింది.

500 కంటే ఎక్కువ లైవ్‌ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..

Photo Credit: BSNL

ఆండ్రాయిడ్ 10 లేదా తర్వాతి టీవీలు ఉన్న కస్టమర్‌లు ప్లే స్టోర్ నుండి BSNL లైవ్ టీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ముఖ్యాంశాలు
  • మొద‌ట‌గా మధ్యప్రదేశ్, తమిళనాడులోని క‌స్ట‌మ‌ర్‌ల‌కు హై స్ట్రీమింగ్ క్వాలిట
  • Google Play Store నుండి BSNL లైవ్ టీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా స‌పోర
ప్రకటన

కేంద్ర ప్ర‌భుత్వరంగ‌ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎన్ఎల్ (BSNL) దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవను ప్రారంభించినట్లు తెలిపింది. IFTVగా పిలువబడే ఈ సేవలను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ కొత్త లోగో, ఆరు కొత్త సౌకర్యాలను గత నెలలో మొదటిసారిగా పరిచయం చేసింది. వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్, పే టీవీ సౌకర్యంతో లైవ్ టీవీ స‌ర్వీసుల‌ను అందించేందుకు BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది.

నిజానికి, జాతీయ‌ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించిన తర్వాత ఈ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌రిచ‌య‌మైంది. అంతేకాదు, వినియోగ‌దారులు దేశవ్యాప్తంగా ఉన్న BSNL హాట్‌స్పాట్‌లలో వారి డేటా ధరకే క‌నెక్ట్ అయ్యేలా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసేందుకు అవ‌కాశ‌మిస్తుంది.

హై స్ట్రీమింగ్ క్వాలిటీతో..

ఈ మేర‌కు బీఎస్ఎన్ఎల్ Xలో ఒక పోస్ట్ చేసింది. BSNL కొత్త IFTV సేవలు మధ్యప్రదేశ్, తమిళనాడులోని వినియోగ‌దారుల‌కు హై స్ట్రీమింగ్ క్వాలిటీతో 500కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇది పే టీవీ కంటెంట్‌ను కూడా అందిస్తుంది. ప్ర‌యివేటు టెలికాం సంస్థ‌లు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ అందించే ఇతర లైవ్‌ టీవీ సేవలను అందిస్తున్న‌ప్ప‌టికీ ఈ స్ట్రీమింగ్ ద్వారా వినియోగించే డేటా నెలవారీ కోటా నుండి తీసివేయబడుతుంది. ఇది BSNL IFTV విషయంలో ఉండదు. అంటే, లైవ్‌ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండా బీఎస్ఎన్‌ఎల్‌లో ఈ సేవ‌లు లభిస్తాయి.

అదనపు ఖర్చు లేకుండా..

టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటాను క‌స్ట‌మ‌ర్‌ డేటా ప్యాక్‌లకు సంబంధం లేకుండా ఉంటుంది. అంతేకాదు, ఇది స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది. లైవ్ టీవీ సేవల కోసం BSNL FTTH కస్టమర్లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లయిన‌ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ZEE5 వంటి స్ట్రీమింగ్ యాప్‌లకు కూడా ఇది స‌పోర్ట్ ఇస్తుంద‌ని BNSL స్ప‌ష్టం చేసింది.

ఆ టీవీల వినియోగ‌దారుకుల మాత్ర‌మే..

ఈ సేవ‌ల‌లోనే పిల్ల‌లను ఆక‌ర్షించేందుకు గేమ్‌లను కూడా అందిస్తుంది. అయితే, ఈ IFTV సేవలు ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయ‌ని ఆపరేటర్స్ చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 10 లేదా ఆ తర్వాత వెర్షన్‌తో ర‌న్ అవుతోన్న‌ టీవీలను వినియోగిస్తున్న క‌స్ట‌మ‌ర్‌లు Google Play Store నుండి BSNL లైవ్ టీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

మూడు ప్ర‌ధాన‌ లక్ష్యాలతో..

BSNL IFTV సేవల‌కు సభ్యత్వాన్ని పొందేందుకు వినియోగదారులు ప్లే స్టోర్ నుండి BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవల‌ను ప్రవేశపెట్టడం ద్వారా రూపొందించబడింది. క‌స్ట‌మ‌ర్‌ల‌కు సేవలను సురక్షితంగా, సరసమైన రీతిలో, విశ్వసనీయంగా అందించడం అనే మూడు ప్ర‌ధాన‌ లక్ష్యాలకు అనుగుణంగా దీనిని అందిస్తున్నారు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  2. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  3. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  4. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  5. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  6. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  7. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  8. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
  9. కొత్తగా షావోమీ 16 ప్రో మినీ అనే కాంపాక్ట్ వెర్షన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం
  10. సామ్ సంగ్ గెలాక్సీ S26 ప్రో.. ఫీచర్స్‌లో హైలెట్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »