సిమ్ కార్డ్‌ డోర్ డెల‌వ‌రీ సేవ‌ల‌ను తీసుకొచ్చిన BSNL.. సెల్ఫ్ కేవైసీతో సిమ్ పొందండిలా

సెల్ఫ్ కేవైసీతో వినియోగ‌దారులు త‌మ BSNL సిమ్‌ను ఇంటి వ‌ద్దే పొందే అవ‌కాశాన్ని క‌ల్పించింది. అలాగే, ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్‌ల‌లో ఏ సిమ్ కావాల‌న్నా ఎంపిక చేసుకోవ‌చ్చు.

సిమ్ కార్డ్‌ డోర్ డెల‌వ‌రీ సేవ‌ల‌ను తీసుకొచ్చిన BSNL.. సెల్ఫ్ కేవైసీతో సిమ్ పొందండిలా

Photo Credit: BSNL

బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల భారతదేశంలో తన 5 జి సేవను ప్రవేశపెట్టింది

ముఖ్యాంశాలు
  • అందుబాటులోకి https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ ప్ర‌త్యేక లింక్‌
  • ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల నుంచి పోర్ట్ కోరుకునేవారికి కూడా అవ‌కాశం
  • ఎలాంటి స‌మ‌స్య‌లు లేదా ఫిర్యాదులు ఉన్నా 18001801503 నెంబ‌ర్‌కు కాల్ చేయొచ
ప్రకటన

ఇండియాలోని ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన BSNL త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు సిద్ధ‌మైంది. తాజాగా ఓ స‌రికొత్త ఆలోచ‌న‌తో ముందుకొచ్చింది. సాధార‌ణంగా BSNL సిమ్ కార్డ్ తీసుకోవాలంటే కార్యాల‌యానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే, సంస్థ తాజాగా సిమ్ కార్డ్‌ల‌ను డోర్ డెల‌వ‌రీ చేసేందుకు కొత్త స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అంతే కాదు, సెల్ఫ్ కేవైసీతో వినియోగ‌దారులు త‌మ సిమ్‌ను ఇంటి వ‌ద్దే పొందే అవ‌కాశాన్ని క‌ల్పించింది. అలాగే, ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్‌ల‌లో ఏ సిమ్ కావాల‌న్నా ఎంపిక చేసుకోవ‌చ్చు.

వినియోగ‌దారులు ఎంపిక

కొత్త సేల‌ల‌లో భాగంగా సిమ్ కార్డ్ పొందేందుకు BSNL పోర్ట‌ల్‌లో https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ ప్ర‌త్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనిపై ఒక్క క్లిక్ చేస్తే, ఓ అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన స‌మాచారాన్ని అందించ‌డం ద్వారా కేవీసీ ప్ర‌క్రియ‌ పూర్త‌యిపోతుంది. ఇదే లింక్‌లో ప్రీపెయిడ్ సిమ్‌ లేదా పోస్ట్ పెయిడ్ సిమ్‌ ఏది కావాలో వినియోగ‌దారులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవ‌ల ద్వారా BSNL నెట్‌వ‌ర్క్ యూజ‌ర్స్ మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి.

ప్ర‌క్రియ విధానం ఇలా

ముందుగా పిన్ కోడ్‌, త‌ర్వాత వినియోగ‌దారుని పూర్తి పేరు, ప్ర‌త్యామ్నాయ ఫోన్ నెంబ‌ర్‌ను న‌మోదు చేయాలి. ఈ ప్ర‌క్రియ‌లో సిమ్ ఎవ‌రి కోసం అని అగుతుంది. అంతే, మీకోస‌మా లేదా మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కోస‌మా అని విష‌యాన్ని తెలియ‌జేయాలి. అనంత‌రం మీ ఆధార్ నెంబ‌ర్‌, ఓటీపీ ఎంట‌ర్ చేయాలి. అలా ఆధార్ డేటా బేస్ నుంచి సంబంధిత వివ‌రాలు నిర్థార‌ణ అయిన త‌ర్వాత వీడియో రికార్డింగ్‌తో కొనుగోలుదారు ఫొటో క్యాప్చ‌ర్ అవ్వ‌డంతో కేవైసీ అయిపోతుంది. అంతేకాదు, ఈ స‌ర్వీసులో కొత్త సిమ్ కార్డ్‌తోపాటు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల నుంచి పోర్ట్ కోరుకునేవారికి కూడా అవ‌కాశం ఉంటుంది.

ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు

ముఖ్యంగా, BSNL ఇప్ప‌టికే నెట్‌వ‌ర్క్‌ వినియోగ‌దారుల‌ను చాలావ‌ర‌కూ కోల్పోతోంది. దీనిని అధిగ‌మించేందుకు ఈ సేవ‌ల‌ను ప‌రిచ‌యం చేసిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకు ఉదాహ‌ర‌ణ, తాజాగా టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) రిలీజ్ చేసిన టెలికాం స‌బ్‌స్క్రిప్ష‌న్ డేటాను బ‌ట్టీ, ఏప్రిల్ నెల‌లో మొత్తంగా 0.2 మిలియ‌న్ యూజ‌ర్స్‌ను, 1.8 మిలియ‌న్‌ల యాక్టీవ్ యూజ‌ర్స్‌ను సంస్థ కోల్పోయింది.

స‌మ‌స్య‌లు, ఫిర్యాదులు ఉంటే

ఈ కొత్త సేవ‌ల ద్వారా సిమ్ కార్డ్ డోర్ డెల‌వ‌రీకి సంబంధించిన ఎలాంటి స‌మ‌స్య‌లు లేదా ఫిర్యాదులు ఉంటే మాత్రం 18001801503 నెంబ‌ర్‌కు కాల్ చేయొచ్చ‌ని BSNL చెబుతోంది. నిజానికి, ఈ స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకు రావ‌డంతో సంస్థ కాస్త వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. ప్ర‌ముఖ ప్ర‌యివేటు టెలికాం సంస్థ‌లు జియో, ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు ఈ స‌ర్వీసుల‌ను అందిస్తున్నాయి. తాజాగా BSNL ప‌రిచ‌యం చేసిన ఈ సేవ‌లు ఉచిత‌మా లేక కొంత‌ ఛార్జ్ ఉంటుందా అనే అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. త్వరలో Nothing ఫోన్ 3a విడుదల, హ్యాండ్‌ సెట్‌లో ఉండే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
  2. ఇక స్టాండర్డ్ iPhone 17 మోడళ్లలో LTPO ప్యానెల్స్‌ వాడాలని ఆపిల్ ఆలోచిస్తోంది.
  3. సంచార్ సాథి యాప్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం, ముందస్తుగా డౌన్‌లోడ్ చేసుకోనవసరం లేదని ప్రకటన
  4. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన HyperOS 2 పై నడుస్తుంది.
  5. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, Poco C85 5G గూగుల్ ప్లే కన్సోల్‌లో 2508CPC2BI మోడల్ నంబర్‌తో కనిపించింది.
  6. iPhone 17 విడుదలతో యాపిల్ అధికారికంగా iPhone 16 యొక్క 256GB మరియు 512GB మోడళ్లను నిలిపివేసింది.
  7. సంచార్ సాథి యాప్‌పై ఆపిల్ విముఖత, ప్రభుత్వ ఆదేశాన్ని తిరస్కరించాలనే యోచనలో కంపెనీ
  8. ఇది అక్టోబర్‌లో చైనా మరియు కొన్ని గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదలైంది.
  9. Samsung Galaxy Z TriFold లాంచ్‌తో ఫోల్డబుల్ మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.
  10. కంపెనీ అభివృద్ధి చేసిన Open Canvas సాఫ్ట్‌వేర్ అనుభవం ఈ మోడల్‌లో జోడించబడుతుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »