Photo Credit: Reliance Jio
తాజాగా Reliance Jio 21 దేశాలకు కొత్త ఇంటర్‌నేషనల్ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రతి రీఛార్జ్‌పై ఆన్-కాల్ మినిట్‌లను అందించే కొత్త మినిట్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. కొత్త ISD రీఛార్జ్ ప్లాన్‌లు రూ. 39 నుంచి రూ. 99 మధ్య ప్రారంభమవుతాయి. ఈ కొత్త ప్లాన్‌లను ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్యాక్‌లతో పాటు అనేక ముఖ్యమైన ఇంటర్‌నేషనల్ లోకేషన్స్ పే-యాజ్-యు-గో ప్యాక్‌ల రేట్లను కూడా కంపెనీ మార్పులు చేసింది. కొత్తగా సవరించిన ధరలు, కొత్త మినిట్ ప్యాక్‌లు ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ కొత్త ISD మినిట్స్ ప్యాక్‌లను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ మినిట్ ప్యాక్‌లు సబ్‌స్క్రైబర్‌లకు ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేకుండా పరిమిత ఆన్-కాల్ మినిట్స్‌ను అందిస్తాయి. మామూలుగా చెల్లించే రీఛార్జ్ ప్లాన్‌లకు భిన్నంగా ఈ ప్లాన్‌లు ఉంటాయి. వినియోగదారులు ISD కాల్‌ల కోసం ప్రత్యేకంగా నిమిషాల ఆధారిత పరిమితులు లేకుండా ప్యాక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లు సాధారణంగా అంతర్జాతీయంగా షార్ట్ కాల్స్ చేసే వారికి, వాటిపై ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
కొత్త రిలయన్స్ జియో మినిట్ ప్యాక్ ధర రూ. 39గా ఉంది. ఇది US, కెనడాకు చేసే అంతర్జాతీయ కాల్‌లకు అందుబాటులో ఉంది. ప్యాక్ 30 నిమిషాల ఆన్-కాల్ సమయాన్ని అందిస్తుంది. బంగ్లాదేశ్-లిమిటెడ్ మినిట్ ప్యాక్ ధర రూ.49తో 20 నిమిషాల కాలింగ్‌ను పొందొచ్చు. దీంతోపాటు సింగపూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్, మలేషియాకు కాల్‌లు చేయడానికి, చందాదారులు రూ. 15లో 49 నిమిషాల కాల్ సమయాన్ని వినియోగించుకోవచ్చు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు 69 నిమిషాల మినిట్ ప్యాక్ ధర రూ. 15గా ఉంది. UK, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లకు కాల్‌లు చేయడానికి చందాదారులు రూ. 79 రీఛార్జ్ ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా 10 నిమిషాల కాలింగ్‌ను పొందవచ్చు. అలాగే, రూ. 89 రీఛార్జ్ ప్యాక్ చైనా, జపాన్, భూటాన్‌లను 15 నిమిషాల కాల్ సమయాన్ని కవర్ చేస్తుంది. చివరగా UAE, సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, బహ్రెయిన్‌లకు కాల్స్ చేసేందుకు వినియోగదారులు రూ. 99 రీచార్జ్‌తో 10 నిమిషాల ఆన్-కాల్ సమయాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ టార్గెటెడ్ రీఛార్జ్ ప్లాన్‌లు యూజర్‌లు ఏ ప్రాంతానికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో దానికి మాత్రమే చెల్లించేందుకు సహాయపడాలనే లక్ష్యంతో రూపొందించారు. ఈ హైబ్రిడ్ ప్లాన్‌లు జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ చందాదారులందరికీ అందుబాటులో ఉన్నాయి. ఒక వినియోగదారు తమ నంబర్‌ను ఈ ప్లాన్‌లతో ఎన్నిసార్లయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. కొత్త ప్యాక్‌లు రీఛార్జ్ చేసిన రోజు నుండి ఏడు రోజుల వరకు చెల్లుబాటవుతాయి.
ప్రకటన
ప్రకటన