నెల‌వారీ రీచార్జ్ ఎక్కువ అవుతోంద‌ని బాధ‌ప‌డుతున్నారా? అయితే Jio రూ. 198 ప్లాన్ మీకోస‌మే!

Jio కొత్త రీచార్జ్‌ ప్లాన్ ఖ‌ర్చు రూ. 198కాగా, దీని వ్యాలిడీటి 14 రోజులు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో జియో సినిమా, జియో క్లౌడ్‌తో సహా అనేక జియో యాప్‌లను వినియోగించుకోవ‌చ్చు.

నెల‌వారీ రీచార్జ్ ఎక్కువ అవుతోంద‌ని బాధ‌ప‌డుతున్నారా? అయితే Jio రూ. 198 ప్లాన్ మీకోస‌మే!
ముఖ్యాంశాలు
  • Reliance Jio స‌రికొత్త‌ అపరిమిత 5G ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభి
  • ఇది మ‌న దేశంలోని రిలయన్స్ జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది
  • ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ యాక్సెస్‌ను కూడా అందిస్తో
ప్రకటన
ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌ Reliance Jio మ‌న దేశంలోని Jio ప్రీపెయిడ్‌ యూజ‌ర్ల కోసం ఓ స‌రికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువ‌చ్చింది. ఇది పరిమిత చెల్లుబాటుతో అపరిమిత కాల్స్ అందించే ప్లాన్‌ల‌లో Jio నుంచి వ‌స్తోన్న‌ అత్యంత చ‌వ‌కైన‌ ప్రీపెయిడ్ ప్లాన్ కావ‌డం విశేషం. ఈ ప్లాన్ ఖ‌ర్చు రూ. 198కాగా, దీని వ్యాలిడీటి 14 రోజులు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో జియో సినిమా, జియో క్లౌడ్‌తో సహా అనేక జియో యాప్‌లను వినియోగించుకోవ‌చ్చు. అలాగే, అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను Jio యూజ‌ర్ల కోసం అందిస్తోంది. అయితే, Reliance Jioతో సహా దేశంలోని వివిధ టెలికాం సంస్థ‌లు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను ఇటీవ‌ల‌ పెంచిన విష‌యం తెలిసిందే. 

నెల‌వారీ రీచార్జ్‌ల ధ‌ర‌లు పెరిగిపోయిన ఈ స‌మ‌యంలో Reliance Jio యూజ‌ర్‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌న క‌లిగించింద‌నే చెప్పాలి. నెల‌లో విడ‌త‌ల‌వారీగా త‌క్కువ మొత్తంలో రీచార్జ్ చేసుకునేందుకు 14 రోజుల‌ రూ. 198 ప్లాన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కొత్త రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే రిలయన్స్ జియో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ అన్‌లిమిటెడ్‌ 5G ప్లాన్‌ల జాబితాలో రూ. 198 రిచార్ట్ ప్లాన్‌ను దిగువ‌న పొందుప‌రిచారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అన్‌లిమిటెడ్‌ 5G ప్లాన్‌ల జాబితాలో రూ. 349 రీచార్జ్ చ‌వ‌కైన‌దిగా ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో కొత్త రిచార్జ్ ప్లాన్ రూ. 198 చేరింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు మాత్ర‌మే. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB 4G డేటాను అందంచ‌డం ద్వారా 14 రోజుల‌కు మొత్తం 28GB డేటాను వినియోగించుకోవ‌చ్చు. 

సినిమా ప్రీమియంకు మిన‌హాయింపు..


రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లోనూ ఇతర ప్లాన్‌ల మాదిరిగానే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత వేగం 64kbpsకి పడిపోతుంది. ఇందులో Reliance Jio డేటాతో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఇది ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి ప‌లు కంపెనీ సంబంధిత‌ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తోంది. అయితే, జియో సినిమా ప్రీమియం ఈ ప్లాన్ నుంచి మినహాయించబడింది. 28 రోజులు అంత‌కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న అన్ని ప్లాన్‌ల మాదిరిగానే మిగ‌తా అన్ని ప్ర‌యోజ‌నాల‌నూ ఈ రీచార్జ్‌లో Jio త‌మ యూజ‌ర్‌ల‌కు అందించింది.  
రూ. 349తో పోల్చిన‌ప్పుడు ఈ కొత్త ప్లాన్..

మొత్తంగా Reliance Jio వినియోగ‌దారుల‌కు ఇది ఖచ్చితంగా చ‌వ‌కైన ప్లాన్ అయిన‌ప్ప‌టికీ, కొత్త ప్లాన్‌ 14 రోజుల పరిమిత చెల్లుబాటు విష‌యంలో చాలామంది అనాస‌క్తి చూపిస్తున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా Reliance Jio నుంచి 28 రోజుల చెట్టుబాటు ప్లాన్ రూ. 349తో పోల్చిన‌ప్పుడు ఈ కొత్త ప్లాన్ వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేద‌నే భావ‌న వారి నుంచి వ్య‌క్తం అవుతోంది. ఒకే నెల‌లో రెండు విడ‌త‌లుగా రూ. 198 రిచార్జ్ చేసుకుంటే అయ్యే మొత్తం పాత ప్లాన్ రూ. 349 కంటే ఎక్కువ అవుతోంద‌ని, ప్ర‌యోజ‌నాల విష‌యంలోనూ పెద్ద‌గా మార్పు లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ అధ‌న‌పు భారం కార‌ణంగా పాత రీచార్జే బాగుంద‌ని అంటున్నారు. అయితే, ఈ కొత్త రీచార్జ్ ప్లాన్ విష‌యంలో కంపెనీ వాద‌న మ‌రోలా ఉంది. అధిక మొత్తం ఒకేసారి వెచ్చించేందుకు ఇబ్బంది ప‌డే యూజ‌ర్ల‌కు ఇది ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ప్లాన్‌గా చెబుతోంది. అందు కోస‌మే 14 రోజ‌ల వ్యాలిడీటితో దీనిని తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పుకొస్తోంది. మ‌రి మీరు కూడా Jio యూజ‌ర్లే అయితే, మీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయండి!
Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »