Photo Credit: Reliance Jio
Reliance Jio says its Diwali Dhamaka offer is only valid for a limited time
భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన JioAirFiber కోసం సరికొత్త దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఒక ఏడాదిపాటు JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్‌ను పొందడానికి కొత్త కస్టమర్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో రూ. 20వేల వరకూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇప్పటికే ఉన్న వినియోగదారులు అదే ప్రయోజనాలను పొందేందుకు మూడు నెలల JioAirFiber ప్రత్యేక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇటీవల ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో Zomato గోల్డ్, OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందించింది.
రిలయన్స్ జియో అధికారిక ప్రకటన ప్రకారం.. కొత్త కస్టమర్లు ఏదైనా రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌లో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ల వంటి వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. దాని ద్వారా వారు 3-నెలల దీపావళి ప్లాన్‌తో కొత్త AirFiber కనెక్షన్‌ని కూడా పొందవచ్చు. దీని ప్రత్యేక ఆఫర్ ధర రూ. 2,222గా ఉంది. అదే సమయంలో ప్రస్తుత కస్టమర్‌లు ఒక సంవత్సరం JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ని పొందడానికి అదే దీపావళి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించారు.
రీఛార్జ్ లేదా కొత్త కనెక్షన్ విజయవంతమైన తర్వాత ఆ సబ్‌స్క్రైబర్‌లు ప్రతి నెలా యాక్టివ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌కు సమానమైన 12 కూపన్‌లను అందుకుంటారు. ఈ కూపన్‌లు నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య ఇవ్వబడతాయి. ప్రతి కూపన్‌ను 30 రోజులలోపు సమీపంలోని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియోపాయింట్ స్టోర్ లేదా జియోమార్ట్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో రీడీమ్ చేసుకోవచ్చని ప్రకటించింది. రూ. 15,000 కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై దీనిని పొందవచ్చు.
రిలయన్స్ జియో ఇటీవల కంపెనీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, OTT సబ్‌స్క్రిప్షన్‌లు, అర్హత కలిగిన రీఛార్జ్ ప్యాక్‌లతో ఈ-కామర్స్ వోచర్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8న ముగిసిన ఈ ఆఫర్‌లు త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్‌లపై చెల్లుబాటు అయ్యే రూ. 899, రూ. 999 రీచార్జ్‌లు ఉన్నాయి. ఇది Zee5, SonyLiv, JioCinema Premium, Lionsgate Play, Discovery, SunNxt, Kanchha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi, JioTV వంటి OTT యాప్‌లకు 28 రోజుల యాక్సెస్‌ను అందిస్తుంది. దీని రీచార్జ్ ప్లాన్ రూ. 175గా ఉంది. అంతేకాదు, ఇది రూ. 2,999 కంటే ఎక్కువ షాపింగ్‌పై రూ. 500 వరకూ డిస్కౌంట్ పొందే Ajio వోచర్‌ను కూడా అందిస్తుంది. మొత్తంగా రిలియన్స్ జియో అందిస్తోన్న ఈ దీపావళి ధమాకా ఆఫర్ కొత్త కస్టమర్‌లను ఆకట్టుకుంటోంది.