డిసెంబర్‌లో దేశీయ మార్కెట్‌లోకి iQOO 13 స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్స్ ఇవే
మొబైల్ ప్రియులు ఈ ఏడాదిలో ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో iQOO 13 తప్పకుండా ఉంటుంది. కానీ, ఈ Vivo సబ్-బ్రాండ్ దీని లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దీనికి ముందే ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, దేశీయ మార్కెట్‌లో లాంచ్ టైమ్‌లైన్ గురించి ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గత సంవత్సరం విడుదలైన iQOO 12 మాదిరిగానే iQoo 13 కూడా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో నడుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా భావిస్తున్నాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. iQoo 13లో 6,150mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది