ఇండియాలో Vivo Y300 5G ఫోన్ లాంచ్ తేదీ ఇదే.. డిజైన్, కలర్స్ చూస్తే మతిపోవాల్సిందే
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్‌లో Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ తేదీని ధృవీకరించింది. రాబోయే ఈ Y సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాతోపాటు దాని అధికారిక వెబ్‌సైట్ పేజీ ద్వారా షేర్ చేసింది. Vivo Y300 హ్యాండ్‌సెట్ మూడు ఆకర్షణీయమైన రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని చెబుతోంది. అలాగే, Y300లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే, గతేడాది విడుదలైన Vivo Y200కి కొనసాగింపుగా ఇది వస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ నెలలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేసిన Vivo V40 Liteకు రీబ్రాండ్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి