Android యూజర్‌లకు డిఫాల్ట్ చాట్ థీమ్‌ను అందిస్తోన్న WhatsApp.. ఇక రంగుల పండగే
ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp మరో సరికొత్త ఫీచర్స్‌ను వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, ఎప్పటికప్పుడు యూజర్‌లకు ఆకర్షణీయమైన అప్‌డేట్‌లను అందిస్తూ ఈ సంస్థ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. Android వినియోగదారుల కోసం అనేక రకాల డిజైన్ స్టైల్స్‌లో చాట్‌లు, చాట్ బబుల్‌ల కోసం డిఫాల్ట్ థీమ్ పిక్స్‌ను అందించేలా కొత్త ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. కొత్త వినియోగదారులు ఇంటర్‌ఫేస్ (UI) ద్వారా ఎక్కువ సంఖ్యలో డిజైన్‌లను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది