Photo Credit: Redmi
చైనాలో Redmi Band 3ని చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ బ్యాండ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.47-అంగుళాల దీర్ఘచతురస్రాకార స్క్రీన్‌తో వస్తుంది. అలాగే, ఇది 18 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ బ్యాండ్ హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, స్లీప్ సైకిల్ ట్రాకింగ్ వంటి అనేక హెల్త్, వెల్నెస్ మానిటరింగ్ ఫీచర్‌లను అందించారు. ఈ స్మార్ట్ వేరబుల్ వాటర్ రెసిస్టెన్స్ కోసం 5ATM రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 50 ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లతోపాటు 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. Redmi Band 3 మోడల్ Xiaomi HyperOSలో రన్ అవుతుంది. ఈ Redmi Band 3 మోడల్‌కు సంబంధించిన ధరతోపాటు స్పెసిఫికేషన్స్‌ను చూసేద్దామా?!
చైనాలో ఈ Redmi Band 3 ధర CNY 159 (దాదాపు రూ. 1,900)గా నిర్ణయించబడింది. ఇది Xiaomi చైనా ఈ-స్టోర్ ద్వారా ఆ దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే, నలుపు, లేత గోధుమరంగు, ముదురు బూడిద, ఆకుపచ్చ, గులాబీ, పసుపు వంటి ఐదు రంగుల ఎంపికలలో ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
Redmi Band 3 మోడల్ 172 x 320 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.47-అంగుళాల దీర్ఘచతురస్రాకార స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ 9.99mm మందం, 16.5 గ్రాముల బరువుతో వస్తుంది. దీంతోపాటు ఇది నీటి నిరోధకత కోసం 5 ATM రేటింగ్‌తో వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను సపోర్ట్ చేస్తుంది.
ఈ మోడల్ హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, స్టెప్ ట్రాకర్‌లతో సహా అనేక హెల్త్ ప్రొటక్షన్ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. ఇది 50 ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, Redmi Band 3లో 300mAh బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంతో ఈ బ్యాటరీ 18 రోజుల వరకు ఉంటుందని అధికారికంగా వెల్లడించబడింది. గత మోడల్స్‌తో పోల్చితే ఈ Redmi Band 3 మరింత మెరుగైన పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
కంపెనీ చెబుతున్నదాని ప్రకారం.. ఈ స్మార్ట్ బ్యాండ్ ఎక్కువ వినియోగ సమయంలో తొమ్మిది రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని ధృవీకరించారు. ఈ స్మార్ట్ వేరబుల్ రెండు గంటలలోపు 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ బ్యాండ్ WeChat, AliPay ఆఫ్‌లైన్ చెల్లింపులకు సపోర్ట్ చేయడం వినియోగదారులకు అదనపు ఫీచర్‌గా చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన